China Real Estaes : ఇల్లు కొంటే భార్య ఉచితం..
ఒకటి కొంటే రెండోది ఫ్రీ, రెండు కొంటే మూడోది ఉచితం..సాధారణంగా ఇప్పటి వరకు ఇలాంటి ఆఫర్లే చూశాం. మార్కెట్లో తమ ప్రోడక్ట్స్ సేల్స్ పెంచుకునేందుకు కస్టమర్లకు వ్యాపారులు రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. కానీ..చైనాలో(china) ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ(Real Estate Company) మాత్రం.. అందరికీ భిన్నంగా..అంతా నిర్ఘాంతపోయేంతగా విచిత్రమైన ఆఫర్ పెట్టింది. వింటే మాత్రం..వామ్మో ఇదే ఆఫర్ అని నోరెళ్లబెట్టడం మనవంతవుతుంది.
ఒకటి కొంటే రెండోది ఫ్రీ, రెండు కొంటే మూడోది ఉచితం..సాధారణంగా ఇప్పటి వరకు ఇలాంటి ఆఫర్లే చూశాం. మార్కెట్లో తమ ప్రోడక్ట్స్ సేల్స్ పెంచుకునేందుకు కస్టమర్లకు వ్యాపారులు రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. కానీ..చైనాలో(china) ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ(Real Estate Company) మాత్రం.. అందరికీ భిన్నంగా..అంతా నిర్ఘాంతపోయేంతగా విచిత్రమైన ఆఫర్ పెట్టింది. వింటే మాత్రం..వామ్మో ఇదే ఆఫర్ అని నోరెళ్లబెట్టడం మనవంతవుతుంది. అసలు విషయానికి వస్తే.. చైనాలో ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఆస్తుల విలువల పతనం..ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే..రియల్ ఎస్టేట్‌లో తలెత్తిన సంక్షోభం..చైనా ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలు రకరకాల ప్రయత్నాలు..మార్కెట్ వ్యూహాలతో ఇళ్లను(House) అమ్మే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా టియాంజన్‌లోని ఓ కంపెనీ ఎంత విచిత్రమైన రీతీలో వ్యాపార ప్రకటన ఇచ్చింది. అది చూస్తే ఎవరైనా ఛీ అని కచ్చితంగా అంటారు. మరి ఇంత ఘోరమా అంటూ ముక్కున వేలేసుకుంటారు ! ఇంతకీ అదేంటంటే..'ఇల్లు కొనండి భార్యను(Wife) ఉచితంగా పొందండి' అని అడ్వర్టైస్‌మెంట్ ఇచ్చింది. అలాగే జెజియాంగ్ ప్రావిన్స్‌లోని మరో రియల్ ఎస్టేట్ కంపెనీ ఏకంగా బంగారు కడ్డీలను ఇస్తామని ప్రకటించిందట. ఇల్లు కొనడానికి ఏదైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు. కానీ.. మరీ ఇలా భార్యలేంటి..అంటూ కొందరు సీరియస్ అయ్యారు. పైగా ఇది చైనీస్ రెగ్యులేటర్‌లకు కూడా నచ్చలేదట. ఇలా ప్రకటన ఇచ్చినందుకగానూ సదరు కంపెనీకి రూ. 3 లక్షల దాక జరిమాన విధించిందట. మొత్తానికి..కట్టించిన ఇళ్లు అమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు అంత నీచానికి దిగజారాయన్నమాట. వాస్తవానికి గత రెండేళ్ల నుంచి చైనాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పతమైంది. దీంతో మల్టీ బిలయన్ డాలర్ల కంపెనీలన్నీ కుప్పకూలాయి. మొత్తానికి.. చైనాలో రియల్ ఎస్టేట్ తిరోగమనం మరో రెండేళ్ల పాటు కొనసాగుతుందని చైనా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.