ఇప్పుడు యువత ఉద్యోగం చేయడం కంటే సొంతంగా బిజినెస్(Business) చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఆలోచించేవారికి కేంద్ర ప్రభుత్వం(Central government) గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో మీ ఆదాయం చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభమవుతుంది. అదే ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రం. ఈ పథకంపై ఆసక్తి చూపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది.

ఇప్పుడు యువత ఉద్యోగం చేయడం కంటే సొంతంగా బిజినెస్(Business) చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఆలోచించేవారికి కేంద్ర ప్రభుత్వం(Central government) గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో మీ ఆదాయం చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభమవుతుంది. అదే ప్రధాన్ మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రం. ఈ పథకంపై ఆసక్తి చూపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. అలాగే మరింత సంపాదించేందుకు ఇది సహయపడుతుంది. ఈ స్కీమ్ ద్వారా ప్రజలకు అందుబాటు ధరల్లో మందులు(Medicine) అందుబాటులో ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దేశంలో ఇప్పటివరకు 9,400 కంటే ఎక్కువ ప్రధాన మంత్రి జన్ ఔషది కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. అలాగే వాటి సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దేశంలో మరో 2 వేల జన్ ఔషది కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో 1000 కేంద్రాలు ఆగస్ట్ 2023 నాటికి ఓపెన్ అవుతాయి. ఈ మిగిలిన 1000 కేంద్రాలు సంవత్సరం చివరినాటికి అంటే డిసెంబర్ 2023 నాటికి తెరవబడతాయి. ఈ మందుల కేంద్రాల్లో 1800 రకాల మందులు, 285 వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రాండెడ్ మందులతో పోల్చితే జన ఔషధి కేంద్రాలలో 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు మందులు లభిస్తాయి.

రూ. 5000 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు..
ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్రాన్ని తెరవడానికి మీరు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. దీని ధర రూ. 5000. ఈ కేంద్రాలను తెరవడానికి దరఖాస్తుదారుడు D లేదా B ఫార్మా పూర్తి చేసి ఉండాలి. ఫార్మా సర్టిఫికేట్ తప్పనిసరి. ఇవే కాకుండా మెడికల్ షాప్ తెరవడానికి తగినంత స్థలం కూడా కలిగి ఉండాలి. దాదాపు 120 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ సమయంలో ప్రత్యేక కేటగిరీ, ప్రత్యేక ప్రాంతం దరఖాస్తు దారులకు రుసుము మినహాయింపు కోసం ఒక నిబంధన కూడా ఉంది.

ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది..
ప్రధాన మంత్రి జన్ ఔషధి కేంద్రాన్ని తెరిచిన తర్వాత ప్రభుత్వం ప్రోత్సాహక మొత్తం రూపంలో ఆర్థిక సహాయం అందజేస్తుంది. రూ. 5 లక్షల వరకు లేదా నెలకు గరిష్టంగా రూ. 15 వేలు నెలవారీ మందుల కొనుగోళ్లపై 15 శాతం ఇన్సెంటివ్ ఇవ్వాలని రూల్ ఉంది. ప్రత్యేక కేటగిరీలు లేదా ప్రాంతాలలో అవస్థాపన ఖర్చులకు రీయింబర్స్మెంట్ గా ప్రభుత్వం అదనపు ప్రోత్సాహక మొత్తంగా రెండు లక్షల రూపాయాలను ఒకేసారి అందజేస్తుంది.

దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు..
1. ఆధార్ కార్డ్
2. ఫార్మసిస్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
3. పాన్ కార్డ్
4. మొబైల్ నంబర్
5. నివాస ధృవీకరణ పత్రం

దరఖాస్తు ప్రక్రియ..
1. ముందుగా janaushadhi.gov.in అధికారిక వెబ్ సైట్ లాగిన్ కావాలి.
2. హోం పేజీలోని మెనూలో Apply For Kendra అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. కొత్త పేజీలో క్లిక్ హియర్ టు అప్లై ఆప్షన్ పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు సైన్ ఇన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. దాని కింద రిజిస్టర్ నౌ ఆప్షన్ పై సెలక్ట్ చేయాలి.
5. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫారమ్ మీ స్క్రీన్ పై ఓపెన్ అవుతుంది. అందులో కోరిన సమాచారాన్ని ఎంటర్ చేయాలి.
6. తర్వాత డ్రాప్ బాక్స్ లో స్థితిని ఎంచుకుని ID పాస్ వర్డ్ విభాగంలో కన్ఫర్మ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.
7. తర్వాత నిబంధనలు, షరతులపై టిక్ చేసి ఆపై సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు పీఎం జన్ ఔషధి కేంద్రం కోసం మీ ఆన్ లైన్ దరఖాస్తు పూర్తి అవుతుంది.

Updated On 9 Jun 2023 12:26 AM GMT
Ehatv

Ehatv

Next Story