యూపీఐ పేమెంట్స్ చేసేవారికి కేంద్రం తర్వలోనే షాకింగ్ న్యూస్ చెప్పనుంది.

యూపీఐ పేమెంట్స్ చేసేవారికి కేంద్రం తర్వలోనే షాకింగ్ న్యూస్ చెప్పనుంది. డీమానిటైజేషన్ తర్వాత ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగాయి. దీంతో జనాలు జేబులో ఎక్కువ డబ్బులు ఉంచుకోవడం లేదు.కిరాణా షాపు నుంచి కూరగాయ షాక్, ఆఖరికి బిచ్చగాళ్లు కూడా క్యూర్ కోడ్ స్కానర్ చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. యూపీఐ పేమెంట్స్ బాగా అలావాటు పడిపోయారు. ఎంతగా అంటే జేబులో రూపాయి లేకున్నా.. స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని దేశం మొత్తం తిరిగి రావచ్చు.త్వరలోనే భారత ప్రభుత్వం రూ.2వేలు పైబడి చేసే ట్రాన్సాక్షన్లపై 18 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేయాలని ఆలోచిస్తోందట. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు దీనిని ఒక పెద్ద మార్గంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇది అమలులోకి వస్తే సాధారణ వినియోగదారుల నుంచి చిరువ్యాపారుల వరకు అందరిపై అదనపు భారాన్ని పడుతుందని ఆందోళనలు వస్తున్నాయి. ఈ చర్యతో డిజిటల్ చెల్లింపులలో నియంత్రిత తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది అమలులోకి వస్తే ప్రజలు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నుంచి తప్పుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ehatv

ehatv

Next Story