✕
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రిప్టో కరెన్సీ విలువ భారీగా పెరిగిపోతోంది.

x
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రిప్టో కరెన్సీ విలువ భారీగా పెరిగిపోతోంది. ప్రపంచ క్రిప్టో క్యాపిటల్‌గా దేశాన్ని మారుస్తానని, క్రిప్టో రిజర్వ్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో బిట్‌కాయిన్ విలువ అమాంతం పెరిగిపోతూనే ఉంది. అనేక క్రిప్టో కరెన్సీల విలువ కూడా భారీగా పెరిగిపోయింది. ట్రంప్ ప్రకటనతో బిట్‌కాయిన్ ధర రూ.91 వేల డాలర్లు (రూ.80 లక్షలు) దాటిపోయింది. ఎక్స్‌ఆర్‌పీ, సోలానా, కార్డానో, ఈథర్ ధరలు కూడా భారీగా పెరిగిపోయాయు.ఎక్స్‌ఆర్‌పీ 31 శాతం పెరిగి 2.92 డాలర్లకు, కార్డానో విలువ 1.1 డాలర్లకు చేరింది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో క్రిప్టో కాయిన్స్ మాత్రమే కాకుండా.. మార్కెట్లు కూడా పుంజుకున్నాయి.దీనికి తోడు మార్చి7న క్రిప్టో సమ్మిట్‌ను నిర్వహిస్తారని వైట్‌హౌస్ ప్రకటించడంతో వీటి ధరలకు రెక్కలు వచ్చాయి

ehatv
Next Story