CNG కార్లు: పెట్రోల్ డీజిల్ ధరలమండిపోతున్నాయి . అందుకే ఇప్పుడు చాలా మంది CNG కార్లను ఇష్టపడటం ప్రారంభించారు. CNG కార్లలో CNG ధర తక్కువగా ఉండటంతో పాటు మైలేజీ కూడా ఎక్కువగా ఉంటుంది, అందుకే CNG కారు బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు . మీరు కూడా CNG కారును కొనాలి అనుకుంటే , ఎక్కువ మైలేజీతో పాటు ఎక్కువ స్పేస్ ఉన్న పెద్దCNG కార్ల గురించి ఇక్కడ తెలుసుకోండి .

మారుతీ సుజుకి ఎర్టిగా సిఎన్‌జి(Maruti Suzuki Ertiga CNG)
మారుతి సుజుకి ఎర్టిగా VXI ట్రిమ్ ను CNG లో పొందవచ్చు . ఇది 1462 cc ఇంజిన్‌ను కలిగి ఉంటుంది ఇది 5500 rpm వద్ద 86.63 bhp పవర్ తో పాటు 4200 rpm వద్ద 121.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 26.11 km/kg కిమీ మైలేజీని ఇస్తుంది. ఈ కారు పెర్ల్ మెటాలిక్ డిగ్నిటీ బ్రౌన్, పెరల్ మిడ్‌నైట్ బ్లాక్, మాగ్మా గ్రే, పెరల్ మెటాలిక్ ఆర్కిటిక్ వైట్, ఆబర్న్ రెడ్, స్ప్లెండిడ్ సిల్వర్ ఇంకా ప్రైమ్ ఆక్స్‌ఫర్డ్ బ్లూ వంటి 7 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.10.44 లక్షలు. ఇది మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పవర్ అడ్జస్టబుల్ ఎక్స్‌టీరియర్ రియర్ వ్యూ మిర్రర్, టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫాగ్ లైట్లు ఇంకా ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది .

మారుతీ సుజుకి XL 6 CNG(Maruti Suzuki XL 6 CNG)
మారుతి సుజుకి XL6 జీటా వేరియంట్ 1462cc ఇంజన్‌ తో వస్తుంది , ఇది 6000rpm వద్ద 86.63bhp పవర్ ని , 4200rpm వద్ద 121.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ARAI ధృవీకరించబడిన 20.32 km/kg మైలేజీని ఇస్తుంది . ఈ కారు 6 రంగులలో అందుబాటులో ఉంది, వీటిలో ఆర్కిటిక్ వైట్, నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండియర్ గ్రే, ఓపులెంట్ రెడ్ ఇంకా బ్రేవ్ ఖాకీ విత్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి. ఇది ఎర్టిగాలో ఉన్న అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.12.51 లక్షలు.

Updated On 28 April 2023 5:29 AM GMT
rj sanju

rj sanju

Next Story