సంపాదనని సరైన రీతిలో పొదుపు చేయగలిగితేనే భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది . కానీ పొదుపు విధానంలో చాలా జాగ్రత్తలు అవసరం . మీరు కనుక మీ డబ్బుని ఎఫ్‌డిని FD విధానం ద్వారా పొదుపు చేయాలనుకుంటే ఏ బ్యాంకులు అధిక వడ్డీలను ఇస్తున్నాయి అనేది తప్పక తెలుసుకోవాలి . గత కొన్ని నెలలుగా, దేశంలోని అనేక బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (Fixed Deposit)అందించే వడ్డీ రేట్లను విపరీతంగా పెంచాయి. దీనివల్ల మీకు రెట్టింపు రాబడి లభిస్తుంది. ఈ రోజుల్లో చాలా బ్యాంకులు స్వల్పకాలిక(Short period ) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చాలా మంచి వడ్డీని ఇస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, చాలా బ్యాంకులు 1.25 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు FDలపై 8 నుండి 8.50% వడ్డీని అందిస్తున్నాయి.

ప్రస్తుతం వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా ఇన్వెస్టర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని పొందుతున్నారు. బ్యాంక్ FD చేసేవారు FD ఎంతకాలం చేయచ్చు అనేది మీరే ఎంచుకోవచ్చు. స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8 శాతం కంటే ఎక్కువ వడ్డీని ఇస్తున్న కొన్ని బ్యాంకుల వివరాలను ఇప్పుడు చూద్దాం

DCB బ్యాంక్: DCB బ్యాంక్ తన FD వినియోగదారులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు 3.75% నుండి 8% వరకు వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ 15 నెలల నుండి 24 నెలల కంటే తక్కువ FD కాలవ్యవధిపై 8% అందిస్తుంది.

బంధన్ బ్యాంక్(Bandhan Bank): బంధన్ బ్యాంక్ సాధారణ ప్రజలకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు FDలపై 3% నుండి 8% మధ్య వడ్డీని అందిస్తోంది. 600 రోజుల FDపై ఈ బ్యాంక్ అత్యధికంగా 8% వడ్డీని ఇస్తోంది.

IDFC ఫస్ట్ బ్యాంక్: 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్ల కోసం IDFC ఫస్ట్ బ్యాంక్ కస్టమర్‌లకు బ్యాంక్ 3.5% నుండి 7.00% వడ్డీ రేటును అందిస్తోంది. IDFC ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుతం 18 నెలల 1 రోజు నుండి 3 సంవత్సరాల వరకు (549 రోజుల నుండి 3 సంవత్సరాలు) మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై గరిష్టంగా 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

ఇండస్ఇండ్ బ్యాంక్(IndusInd bank): ఇండస్ఇండ్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు 3.50% నుండి 7.75% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. 1 సంవత్సరం 6 నెలల నుండి 2 సంవత్సరాల 9 నెలల కాల వ్యవధిలో బ్యాంక్ అత్యధికంగా 7.75% వడ్డీని చెల్లిస్తోంది.

యాక్సిస్ బ్యాంక్(Axis Bank): యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.50 శాతం నుండి 7 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 2 సంవత్సరాల నుండి 30 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై బ్యాంక్ అత్యధికంగా 7.20 శాతం వడ్డీ రేటును అందిస్తోంది, సీనియర్ సిటిజన్‌లు ఈ కాలానికి చెందిన ఎఫ్‌డిలపై 7.95 శాతం వడ్డీని పొందుతారు.

Updated On 26 April 2023 3:55 AM GMT
rj sanju

rj sanju

Next Story