అక్షయ తృతీయ(Akshaya Tritiya) రోజున బంగారం కొంటే శుభం కలుగుతుందన్నది ఓ నమ్మకం. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి జ్యువెలరీ షాపులు బోల్డన్నీ ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ రోజున బంగారం కొంటే ఏడాదంతా ధనలక్ష్మి నట్టింట్లో తాండవమాడుతుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే కస్టమర్లను ఆకట్టుకోవడానికి జ్యువెలరీ షాపులు డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నాయి. జీఆర్‌టీ జువెలర్స్‌ బంగారు ఆభరణాల తరుగుపై 20 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. వెండి వస్తువుల మేకింగ్‌ ఛార్జీలపై పాతికశాతం తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది.

అక్షయ తృతీయ(Akshaya Tritiya) రోజున బంగారం కొంటే శుభం కలుగుతుందన్నది ఓ నమ్మకం. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడానికి జ్యువెలరీ షాపులు బోల్డన్నీ ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ రోజున బంగారం కొంటే ఏడాదంతా ధనలక్ష్మి నట్టింట్లో తాండవమాడుతుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే కస్టమర్లను ఆకట్టుకోవడానికి జ్యువెలరీ షాపులు డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నాయి. జీఆర్‌టీ జువెలర్స్‌ బంగారు ఆభరణాల తరుగుపై 20 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. వెండి వస్తువుల మేకింగ్‌ ఛార్జీలపై పాతికశాతం తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది. వెండి ఆభరణాల ఎంఆర్‌పీ రేటుపై పది శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. బంగారు నాణేలపై తరుగులేదంది. ఇక అన్ని బంగారు ఆభరణాల తరుగులో ఒక శాతం తగ్గింపునిస్తున్నామని ప్రకటించింది లలితా జ్యువెలర్స్‌. బంగారు నాణేలపై ఎలాంటి తరుగును తీయబోమని తెలిపింది. ఫోన్‌ పే ద్వారా 24 క్యారెట్ల బంగారాన్ని కొన్నవారికి ఉచిత స్టోరేజ్‌ సౌకర్యం కల్పిస్తున్నామని ఆ యాప్‌ తెలిపింది. మేకింగ్‌ ఛార్జీలు కూడా ఉండవని చెప్పింది.

ఒక గ్రాము కంటే ఎక్కువ బంగారాన్ని కొన్న వారికి 50 నుంచి 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభిస్తుందని ఫోన్‌ పే యాప్‌ ప్రకటించింది. జోయలుక్కాస్‌ కూడా కొన్ని ఆఫర్లను ప్రకటించింది. పది వేల రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే వెండి ఆభరణాలు కొన్నవారికి 500 రూపాయల విలువ చేసే గిఫ్ట్ ఓచర్‌ను ఇస్తుంది. 50 వేల రూపాయలు, అంతకంటే ఎక్కువ విలువ చేసే బంగారు నగలు కొన్నవారికి వెయ్యి రూపాయల గిఫ్ట్‌ ఓచర్‌ను ఇస్తుంది. వజ్రాలు, అన్‌కట్‌ వజ్రాలు, అరుదైన ఆభరణాలను 50 వేల రూపాయలకు మించి కొన్నవారికి రెండు వేల రూపాయల గిఫ్ట్ ఓచర్‌ను ఇస్తుంది జోయలుక్కాస్‌. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో చెల్లింపులు చేస్తే అదనంగా అయిదు శాతం క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. కాకపోతే ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో చేసే కొనుగోళ్ల విలువ 30 వేల రూపాయలు దాటాలి. బంగారం, వజ్రాభరణాల మేకింగ్‌ ఛార్జీలపై 20 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింద తనిష్క్‌. ముందుగానే బుక్‌ చేసుకున్నవారికి గోల్డ్‌ రేటు ప్రొటెక్షన్‌ కూడా ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా 80 వేల రూపాయలకు మించి కొనుగోలు చేసిన వారికి నాలుగు వేల రూపాయల డిస్కౌంట్‌ లభిస్తుంది. 30 వేల రూపాయల విలువైన బంగారు నగలను కొన్నవారికి ఉచితంగా వంద మిల్లీ గ్రాముల బంగారు నాణేన్ని ఇస్తామని మలబార్‌ గోల్డ్‌ ప్రకటించింది. ఒకవేళ 30 వేల రూపాయల విలువైన వజ్రాలు, ఇతర విలువైన ఆభరణాలను కొంటే 250 మిల్లి గ్రాముల బంగారు నాణేలను అందిస్తామని చెప్పింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి అదనంగా మరో అయిదు శాతం క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుంది.

Updated On 21 April 2023 2:10 AM GMT
Ehatv

Ehatv

Next Story