ఒకప్పుడంటే ఏమో కానీ ఇప్పుడు విమాన యాత్ర ఈజీ అయిపోయింది. మధ్యతరగతి కూడా విమాన ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తున్నారు. పైగా ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. లేటెస్ట్‌గా టాటా గ్రూప్(TATA Group) యాజమాన్యంలోని ఎయిరిండియా(Air India) కూడా స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో 96 గంటల ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది.

Air india Bumper Offer
ఒకప్పుడంటే ఏమో కానీ ఇప్పుడు విమాన యాత్ర ఈజీ అయిపోయింది. మధ్యతరగతి కూడా విమాన ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తున్నారు. పైగా ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. లేటెస్ట్‌గా టాటా గ్రూప్(TATA Group) యాజమాన్యంలోని ఎయిరిండియా(Air India) కూడా స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో 96 గంటల ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఇందులో ప్యాసింజర్లకు అట్రాక్టివ్ ఛార్జీలతో విమాన టికెట్లను అందిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎకానమీ విమాన టికెట్ల ఛార్జీలు 1470 రూపాయలు, బిజినెస్ క్లాస్ ఛార్జీలు 10,130 రూపాయల నుంచి మొదలవుతాయి. అదే విధంగా ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాలకు ఆకర్షణీయమైన ఛార్జీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 20వ తేదీ వరకు అందుబాటులో ఉండే నాలుగు రోజుల సేల్‌లో బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ప్రయాణించవచ్చు. ఎయిరిండియా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌తో పాటు, అధీకృత ట్రావెల్ ఏజెంట్లు, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టికెట్లను కొనుక్కోవచ్చు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన టకెట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆలసించిన ఆశాభంగం. ఈ ఆఫర్‌లో హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ఎయిరిండియా విమాన టికెట్ 1,931 రూపాయలు మాత్రమే.
