ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' దివాళా తీసిందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' దివాళా తీసిందా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఆహా సంస్థ ఇటీవల కాస్త భారీగానే సిబ్బందిని తగ్గించుకుందనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 50 మందిని తొలగించారని టాక్. తెలుగులో భారీ పెట్టుబడులతో ఆహా ప్రారంభమైంది. నాన్‌స్టాపబుల్‌ టాక్‌ విత్ ఎన్‌బీకే పేరుతో బాలకృష్ణ కూడా షో చేసి ఈ ఓటీటీని బాగా ప్రమోట్‌ చేశారు.ఓన్ కంటెంట్ మీద దృష్టి పెట్టింది. కొనుగోళ్లు కూడా సాగించింది. అదే టైమ్ లో తమిళంలో కూడా ఓటిటిని స్టార్ట్ చేసింది. అయితే మల్టీ నేషనల్‌ ఓటీటీల నుంచి పోటీని తట్టుకోలేకపోతుంది. కంటెంట్‌ కొంటూనే ఉండాలి. వందల కోట్ల పెట్టుబడి పెడుతుండాలి. కొత్త కంటెంట్‌ కోసం కోట్లకు కోట్లు కుమ్మరిస్తూనే ఉండాలి. ఈ నేపథ్యంలో రోజు రోజుకూ ఆహా ఓటిటి సంస్థ వెనక్కు తగ్గుతూ వస్తోంది. నష్టాల్లో వుందని, సిబ్బందిని తగ్గించుకుంటోందని తరచూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆహాలో 40-50 మంది సిబ్బందిని తొలగించారని సమాచారం. చాలా లిమిటెడ్ ఉద్యోగులతో సంస్థ నడుస్తోందని తెలుస్తోంది. సరిగా పర్ఫార్మెన్స్ చేయని ఉద్యోగులనే తొలగిస్తున్నట్లు యాజమాన్యం చెప్తున్నట్లుగా తెలుస్తోంది.

ehatv

ehatv

Next Story