ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం అంబుజా సిమెంట్‌లో సుమారు $450 మిలియన్ల విలువైన వాటాను విక్రయించాలని ప్రపంచ రుణదాతలకు అధికారిక అభ్యర్థన చేసినట్లు తెలిసింది.

ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం అంబుజా సిమెంట్‌లో సుమారు $450 మిలియన్ల విలువైన వాటాను విక్రయించాలని ప్రపంచ రుణదాతలకు అధికారిక అభ్యర్థన చేసినట్లు తెలిసింది. అదానీ కుటుంబానికి అంబుజా సిమెంట్‌లో 63 శాతం వాటా ఉంది.వీటిలో నాలుగు నుండి ఐదు శాతం విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది .

గత కొద్దికాలంగా అదానీ సంస్థ స్టాక్ మార్కెట్ లో గట్టి ఒత్తిడులను ఎదురుకుంటున్న విషయం తెల్సిందే . జీక్యూజీ పెట్టుబడి సంస్థ అదానీ సంస్థ లో వాటాలను కొనడంతో స్టాక్ మార్కెట్లో అదానీ షేర్లలో తిరిగి పురోగతి కనిపిస్తుంది . ప్రస్తుతం ఉన్న తీర్చుకొనే దిశగా అంబుజా సిమెంట్ లో నాలుగు నుండి ఐదు శాతం షేర్లను అదానీ సంస్థ అమ్మాలని చూస్తుంది .

గత సంవత్సరం $10.5 బిలియన్లకు అదానీ సంస్థ అంబుజా సిమెంట్ ను కొనుగోలు చేసింది. అంబుజా సిమెంట్స్‌కు ఛైర్మన్‌గా గౌతమ్‌ అదానీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం, అంబుజా సిమెంట్ కంపెనీలో ఐదు శాతం వాటా విలువ సుమారు $465 మిలియన్లు.వచ్చిన డబ్బుతో ప్రపంచ రుణాలను తెరుచుకోవాలని యోచిస్తోంది అదానీ సంస్థ . ఇప్పటికే చాల అప్పులను అదానీ గ్రూప్ కొన్ని ముందస్తుంగా చెల్లించటం జరిగింది . హిడెన్ బర్గ్ లేవనెత్తిన ప్రశ్నలపై సుప్రీంకోర్టు త్వరలో నివేదిక ఇవ్వనుంది .

Updated On 11 March 2023 4:19 AM GMT
Ehatv

Ehatv

Next Story