బంగారం ఎప్పటికైనా బంగారమే! విలువ పెరుగుతుందే తప్ప తరగడమంటూ ఉండదు. అందుకే ఆ పచ్చలోహంపై పిచ్చ మోహం. ఒకప్పుడు బంగారం(Gold) నగల రూపంలోనే ఇంట్లో ఉండేది.

బంగారం ఎప్పటికైనా బంగారమే! విలువ పెరుగుతుందే తప్ప తరగడమంటూ ఉండదు. అందుకే ఆ పచ్చలోహంపై పిచ్చ మోహం. ఒకప్పుడు బంగారం(Gold) నగల రూపంలోనే ఇంట్లో ఉండేది. ఎన్ని నగలుంటే అంత గొప్పన్నమాట! ఇప్పుడు అలా కాదు.. బంగారాన్ని ఓ పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. మొన్నటి బడ్జెట్‌లో బంగారంపై కనీస కస్టమ్స్‌ టాక్స్‌(Customs tax)ను తగ్గించిన విషయం తెలిసే ఉంటుంది. ఇంతకు ముందు పది శాతం ఉండేది. ఇప్పుడు ఆరు శాతానికి తగ్గించారు. అందుకే బడ్జెట్‌ ముందు పరుగులు పెట్టిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.

గడిచిన నాలుగైదు రోజులలో పది గ్రాముల బంగారం ధరలో అయిదారు వేల రూపాయలు తగ్గింది. 24 క్యారెట్‌ పుత్తడి ధర 70 వేల రూపాయల దిగువకు, 22 క్యారెట్‌ రేటు 63 వేల రూపాయల దరిదాపుల్లోకి వచ్చింది. ధరలు మరింత తగ్గుతాయేమోనని ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం ఎదురుచూడటం కంటే ఇప్పుడు కొనుక్కోవడమే మంచిదని చెబుతున్నారు. ఇప్పుడు బంగారం భౌతిక రూపం నుంచి కాగితం, వర్చువల్‌ రూపానికీ మారింది. అంచేత చాలా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు.

బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మొదట గుర్తుకొచ్చేది ఆభరణాలే! అయిదే ఆదరాబాదరగా నగలను కొనకూడదు. హాల్‌మార్క్‌తోపాటు తయారీ, తరుగు, ఇతరత్రా ఖర్చులన్నింటినీ చూసుకోవాలి. రెండు మూడు షాపులను తిరగాలి. ఎక్కడ నాణ్యమైన బంగారం కొంచెం తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడ కొనుక్కోవాలి. నగ డిజైన్‌నుబట్టి కూడా దాని ధర మారుతుందని మహిళలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక బంగారు నాణేలపై కూడా పెట్టబడి పెట్టవచ్చు.

నగల వర్తకులు, బ్యాంకులు(Banks), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, చివరకు ఈ-కామర్స్‌(E commerce) సంస్థలు కూడా గోల్డ్‌ కాయిన్లను(Gold Coin) అమ్ముతున్నాయి. గోల్డ్‌ కాయిన్లు, కడ్డీలు 24 క్యారెట్‌, 99.9 స్వచ్ఛతతో ఉంటాయి. అన్ని నాణేలు, కడ్డీలపై బీఐఎస్‌(Bis) ప్రమాణాలతో కూడిన హాల్‌మార్క్‌ (Hallmark)ఉంటుంది. నకిలీ, మోసం, డ్యామేజీకి తావు లేకుండా ట్యాంపర్‌ ప్రూఫ్‌ ప్యాకేజింగ్‌తో ఉన్న నాణేలను కొనాలి. అర గ్రాము నుంచి 5 తులాలదాకా బరువున్న నాణేలు దొరుకుతాయి. మీ తాహతుకు తగినట్టుగా బంగారు కాయిన్లను కొనుక్కోవచ్చు. కొన్నాళ్లుగా జ్యుయెలర్లు గోల్డ్‌ సేవింగ్స్‌ స్కీములను(Gold Saving Scheme) తెస్తున్నారు. అంటే ప్రతి నెలా కొంత అమౌంట్‌ను సదరు షాపులో జమ చేయాల్సి ఉంటుంది. నిర్ణీత కాల పరిమితి తర్వాత మన డబ్బుకు సమాన విలువైన బంగారాన్ని తీసుకోవచ్చు. కాస్త పేరున్న సంస్థలలో మాత్రమే ఈ స్కీములో చేరాలి. లేకపోతే మొదటికే మోసం రావచ్చు. ఇక గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌నే గోల్డ్‌ ఈటీఎఫ్‌లుగా పిలుస్తున్నారు. ఈ లావాదేవీలు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ)(BambyStockExchange), నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)(NationalStockExchange)ల్లో ప్రధానంగా జరుగుతాయి. సిప్‌లు, స్టాక్‌ బ్రోకర్లు, డీమ్యాట్‌ ఖాతాల ద్వారా ట్రేడింగ్‌కు, పెట్టుబడులకు దిగవచ్చు. కనీసం ఒక గ్రాము బంగారాన్ని పెట్టుబడిగా పెట్టాలి.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల (ఎస్‌జీబీ)(SavaryGoldBonds)ను ప్రభుత్వం జారీ చేస్తుంది. కాబట్టి వీటిలో ధైర్యంగా పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి పెట్టాలనుకునేవారు డిజిటల్‌ గోల్డ్‌లోనూ పెట్టుబడి పెట్టవచ్చు. పేటీఎం(Paytm), ఫోన్‌పే(Phonepay), గూగుల్‌పే (Googlepay)వంటి యాప్‌ల ద్వారా కొనవచ్చు. ఎంఎంటీసీ( MMTC), పీఏఎంపీ(PAMP)లతో ఇవి టైఅప్‌ అయ్యి ఉంటాయి.

ehatv

ehatv

Next Story