ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఖరీదైన స్మార్ట్ ఫోన్స్(smart Phones) లేదా.. ల్యాప్ టాప్స్(Laptops) ఉండాల్సిందే. ఇక ఈ రెండింటి కంటే.. ఇప్పుడు చాలా మంది టాబ్లెట్(Tablets) వాడకం ఎక్కువైంది. లాక్‌డౌన్ తర్వాత వీటి వాడకం మరింత పెరిగిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, నిపుణులు..కంప్యూటర్స్ కు బదులుగా టాబ్లెట్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఖరీదైన స్మార్ట్ ఫోన్స్(smart Phones) లేదా.. ల్యాప్ టాప్స్(Laptops) ఉండాల్సిందే. ఇక ఈ రెండింటి కంటే.. ఇప్పుడు చాలా మంది టాబ్లెట్(Tablets) వాడకం ఎక్కువైంది. లాక్‌డౌన్ తర్వాత వీటి వాడకం మరింత పెరిగిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు, నిపుణులు..కంప్యూటర్స్ కు బదులుగా టాబ్లెట్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు రూ. 10,000 కంటే తక్కువ ధరకే టాబ్లెట్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే మంచి వర్కింగ్ కేపాసిటీ కలిగి టాబ్లెట్ కావాలంటే.. దాదాపు రూ. 25,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడం, వెబ్ బ్రౌజింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, స్ప్రెడ్‌షీట్‌లలో పని చేయడం, గేమింగ్ వంటి రోజువారీ పనుల కోసం ఇవి ఉపయోగపడతాయి. ప్రస్తుతంత అందరికీ ఉపయోగపడే టాబ్లెట్స్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అలాంటి 5 టాబ్లెట్స్ గురించి తెలుసుకుందామా.

1. Apple 9th Gen iPad: రూ.30 వేల కంటే తక్కువ ధరలలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ టాబ్లెట్ లలో ఈ Apple 9th Gen iPad ఒకటి. అధిక-రిజల్యూషన్ డిస్‌ప్లే, ప్రీమియం మెటల్ యూనిబాడీ డిజైన్, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్‌ కలిగి టాబ్లెట్ ఇది. ప్రధాన ఇ-కామర్స్(computers) ప్లాట్‌ఫారమ్‌లలో దీని ధర రూ. 28,990, 9వ జెన్ ఐప్యాడ్ ప్రీమియం సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది చాలా సంవత్సరాలపాటు వర్క్ చేస్తుంది. ఇది 64 GB డేటా సేవ్ చేసుకోవచ్చు.

2. Realme Pad X:
Realme Pad X 5G నెట్‌వర్క్‌ సపోర్ట్ చేస్తుంది. దేశంలోనే అత్యంత తక్కువ ధర కలిగిన టాబ్లెట్స్ లలో ఇది ఒకటి. అంతేకాకుండా 10.95 ఇంచెస్ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్‌తో కూడిన క్వాడ్-స్పీకర్ సెటప్ ఉంటుంది. దీనికి నాన్-5G వేరియంట్ కూడా ఉంది, దీని ధర కేవలం రూ. 19,999. ఇది ప్రీమియం టాబ్లెట్. అలాగే తక్కువ బ్లోట్‌వేర్‌తో దాదాపు స్టాక్ ఆండ్రాయిడ్ లాంటి UIపై కూడా రన్ అవుతుంది.

3. Samsung Galaxy Tab S6 Lite
Samsung Galaxy Tab S6 Lite ప్రస్తుతం రూ. 27,999కి అందుబాటులో ఉంది. Android టాబ్లెట్‌ను కోరుకునే వారికి ఇది బెటర్ అని చెప్పొచ్చు. Wi-Fi, LTE కనెక్టివిటీ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. ఇది కేవలం 465 గ్రాముల బరువున్న 10- ఇంచెస్ ఉన్న టాబ్లెట్‌లలో ఒకటి. Samsung ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ని కలిగి ఉన్నట్లయితే, Galaxy Tab S6 Lite అన్ని Samsung పరికరాల మధ్య అనుసంధానం కలిగి ఉంటుంది.

4. Lenovo Tab P11 Plus
Lenovo Tab P11 Plus దీని ధర రూ. 26,499 ఉంది. మరియు స్టాక్ Android టాబ్లెట్ UIని అందిస్తుంది. ఈ పరికరం MediaTek Helio G90T SoC ఆధారంగా 6 GB RAM, 128 GB స్టోర్ తోపాటు 4G LTE కనెక్టివిటీని కలిగి ఉంది. వినియోగదారులు నామమాత్రపు ధరకు బయట ఫోలియో కీబోర్డ్, మౌస్ కాంబోను కూడా పొందవచ్చు. Xiaomi ప్యాడ్ 6 మాదిరిగానే, ఇది డాల్బీ అట్మోస్‌తో క్వాడ్-స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. ఇది మీ పిల్లలు కొత్త విషయాలను కనుగొనడానికి.. అలాగే నేర్చుకోవడంలో సహాయపడటానికి Google Kids Spaceతో కూడా వస్తుంది.

5. Xiaomi Pad 6:
కొత్తగా లాంచ్ అయిన Xiaomi ప్యాడ్ 6 దాని ముందున్న ప్యాడ్ 5 మాదిరిగానే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 870 SoC, 8 GB వరకు RAM, 256 GB స్టోర్, గేమింగ్, కంటెంట్ కోసం టాబ్లెట్‌ను కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్. అయితే, ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను మిస్ చేస్తుంది. Xiaomi Pad 6 అనేది 144Hz రిఫ్రెష్ రేట్‌తో 11- ఇంచెస్, 10-బిట్ డాల్బీ విజన్-కంప్లైంట్ డిస్‌ప్లేతో అత్యంత చవకైనా టాబ్లెట్ కావడం విశేషం. USB టైప్-C పోర్ట్ ద్వారా 4K 60fps HDMI అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేసే కొన్ని టాబ్లెట్‌లలో ఇది కూడా ఒకటి. ధర కేవలం రూ. 26,999.

Updated On 15 Jun 2023 1:25 AM GMT
Ehatv

Ehatv

Next Story