కొత్త ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతుంటే ఉన్న ఉద్యోగాలు కూడా లేకుండా పోతున్నాయి.

కొత్త ఉద్యోగాలు లేక యువత అల్లాడిపోతుంటే ఉన్న ఉద్యోగాలు కూడా లేకుండా పోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడమే అందుకు కారణం.విస్తరిస్తున్నడిజిటలైజేషన్‌(Digitization),ఆటోమేషన్‌(Automation)ప్రభావం బ్యాంకింగ్‌ రంగంపై పడుతోంది. పెద్ద ఎత్తున జరుగుతున్న కంప్యూటరీకరణతో బ్యాంకుల(Banks)లో మధ్య, దిగువ శ్రేణి క్లరికల్‌(Clerks)పోస్టులు కనుమరుగు అవుతున్నాయి. దీంతో పాటు కృత్రిమ మేధస్సు (AI) రాకతో బ్యాంకుల్లో ఉద్యోగాలు మరింత తగ్గుతున్నాయి. ఈ విషయం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(RBI) ఇచ్చిన నివేదికలో స్పష్టమయ్యింది. 2013 నుంచి 2019 వరకు అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో సహాయక సిబ్బంది సంఖ్య బాగా తగ్గిపోయిందని నివేదిక చెబుతోంది. ఇదే సమయంలో నిపుణులు, సాంకేతిక సిబ్బంది సంఖ్య పెరిగిందట! మన దేశంలో కూడా ఇదే పరిస్థితి.

ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు బ్యాంకులలో డిజిటల్‌ సేవలు(Digital Seva)ఎక్కువగా కనిపిస్తున్నాయి. నగదు డిపాజిట్‌(Money Deposit) చేయాలన్నా, విత్‌డ్రా(Withdraw) చేయాలన్నా బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా పోయింది. దాంతో పాటు గూగుల్‌ పే(Googlepay), ఫోన్‌పే(Phonepay)వంటి పేమెంట్స్‌ యాప్‌(Payment App)లు వచ్చిన తర్వాత వినియోగదారులు బ్యాంకులకు వెళ్లడం లేదు. ఇక పాస్‌బుక్‌ ప్రింటింగ్‌ కూడా కియోస్క్‌(‎KIOSK)ల ద్వారా జరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఈ పనులన్నింటికి ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు వారి అవసరం లేకుండా పోయింది. రాబోయే రోజుల్లో అయిదారు మందితో బ్యాంకులు నడిచినా ఆశ్చ్యపోనక్కర్లేదు!

ehatv

ehatv

Next Story