జ్యోతిష్యం మానవుడి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. జ్యోతిష్యానికి మరో పేరు జోస్యం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జ్యోతిష్యం అనేది జ్యోస్యం నుంచి వచ్చింది. జ్యోస్యం అంటే జరగబోయేది. ఒక మనిషి పుట్టిన తేదీ, సమయం, స్థలాన్ని బట్టి ... ఒక వ్యక్తి జీవితంలో జరిగి౦ది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పటమే జ్యోతిష్యము. ఈ జ్యోతిష్యము అంటే నమ్మకం .,,మరి […]

జ్యోతిష్యం మానవుడి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. జ్యోతిష్యానికి మరో పేరు జోస్యం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జ్యోతిష్యం అనేది జ్యోస్యం నుంచి వచ్చింది. జ్యోస్యం అంటే జరగబోయేది. ఒక మనిషి పుట్టిన తేదీ, సమయం, స్థలాన్ని బట్టి ... ఒక వ్యక్తి జీవితంలో జరిగి౦ది, జరుగుతున్నది, జరగబోయేదీ జననకాల గ్రహస్థితి ప్రకారము, శరీర లక్షణాలు, అర చేతులు, మొదలగు వివిధ అంశాలను ఆధారం చేసుకొని చెప్పటమే జ్యోతిష్యము.

ఈ జ్యోతిష్యము అంటే నమ్మకం .,,మరి కొంతమందికి మూడనమ్మకం . అయితే ఈ జ్యోతిష్యము అను పదములో ‘జ్యోతి’ మరియు ‘ఇష్యము’ అను రెండు శబ్దాలు కలవు. ఆ రెండు శబ్దములను కలిపితే జ్యోతి+ఇష్యము=జ్యోతిష్యము అను శబ్దము వచ్చును . జ్యోతిష్యము లోని మొదటి శబ్దము ‘జ్యోతి’ అనగా వెలుగుచున్న దీపము అని అర్థము. ‘ఇష్యము’ అంటే తెలుసుకోవడము.

అయితే ఇక్కడ కొంతమంది భాషా పండితులకు ఒక సందేహం రావచ్చును. ‘జ్యోతి’ అంటే దీపము అని అర్థము తెలిసిందే కానీ ‘ఇష్యము’ అనగా తెలుసుకోవడము అని అర్థము ఎక్కడా లేదే అని అడుగవచ్చును. సాధారణంగా ఏదయినా ఒక విషయం గురించి తెలుసుకున్న తెలుసుకోవడం అంటాం...
కానీ ‘ఇష్యము’ అను పదము ఎక్కడా వాడుకలో లేదు కదా అని ప్రశ్ని౦చవచ్చు ... ఒక్క శరీరములోని కర్మను తెలుసుకొనే క్రమంలో మాత్రము ‘ఇష్యము’ అను పదమును ఉపయోగించేడివారు. ‘ఇష్యము’ అను పదము లేక శబ్దమును ఒక పాప పుణ్యములను తెలుసుకొనునపుడు మాత్రము ఉపయోగించుట వలన, ఆ పదము ప్రత్యేకమైనది. అలాగే ‘జ్యోతి’ అను పదమునకు ఇక్కడ దీపము అని అర్థము కాదు ‘జ్యోతి’ అంటే జ్ఞానము అని భావించవలెను. ఇది ఒక్క ఆధ్యాత్మికములో మాత్రం ‘జ్యోతిని’ జ్ఞానము అని అంటున్నాము.

ఆత్మ జ్ఞానముగల వ్యక్తి,...తన జ్ఞానముతో ఎదుటి మనిషి శరీరములోని కర్మను తెలుసుకొని వారికి వివరంగా తెలియజేయడమే ‘జ్యోతిష్యము’ అంటాము. ఇక్కడ జ్యోతిష్యము అంటే దీపముతో చీకట్లో ఉన్న వస్తువును తెలుసుకొనేది కాదు, జ్ఞానముతో కర్మను తెలుసుకోవడమని అర్థము. ఇపుడు జ్యోతిష్యము అంటే దైవజ్ఞానము కల్గిన వ్యక్తి, ఒక మనిషి కర్మలోని పాపపుణ్యములను తెలుసుకొని పాప ఫలితమునూ, పుణ్యఫలితమునూ వివరించి చెప్పడము అని అర్ధం . ఇక్కడ ముఖ్య౦గా గమనించాల్సిన విషయ౦ ఏమిటంటే ! శరీరాంతర్గత కర్మ ఫలితాన్ని చెప్పడమే ‘జ్యోతిష్యము’ అనవచ్చును.

అయితే జ్యోతిష్యము అంటే ప్రపంచ౦లోని అన్ని వస్తువులను గురించి చెప్పునది జ్యోతిష్యము కాదు. ఉదాహరణకు దాచిపెట్టిన వస్తువేది అని అడగడము లాంటివి జ్యోతిష్యమునకు సంబంధించిన ప్రశ్నలు కాదు. దానికి సమాధానము చెప్పడము జ్యోతిష్యము కాదు. ఎందుకంటే ఇటువంటి ​ప్రశ్నలన్నీ ఏవైనా కానీ శరీరాంతర్గత కర్మకు సంబంధించినవి కావు. వ్యక్తి కర్మను చూచి చెప్పునవి కావు, అందుకే అది జ్యోతిష్యము కాదు.

ఏది జ్యోతిష్యమో, ఏది జ్యోతిష్యము కాదో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది అదే విధ౦గా జ్యోతిష్యుడు అను పేరు పెట్టుకొన్న వారిలో చాలామంది జ్యోతిష్యమునకు సంబంధించి ప్రశ్న ఏది అవునో ఏది కాదో అని కూడ తెలియని స్థితిలో ఉన్నారు. అటువంటి గందరగోళములోనే కొందరు వాస్తును కూడ జ్యోతిష్యము అంటున్నారు. వాస్తుద్వారా మనిషికి భవిష్యత్తు చెప్పవచ్చు అంటున్నారు. వాస్తవానికి, వాస్తు జ్యోతిష్యము కాదనీ, జ్యోతిష్యశాస్త్రమునకు సంబంధములేదనీ చాలామందికి తెలియదు.

Updated On 16 Feb 2023 6:50 AM GMT
Ehatv

Ehatv

Next Story