సెప్టెంబర్‌ నెల 1వ తేదీ మొదలు 7వ తేదీ శనివారం వరకు ఉండేటటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం.

సెప్టెంబర్‌ నెల 1వ తేదీ మొదలు 7వ తేదీ శనివారం వరకు ఉండేటటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటటువంటి గ్రహగతలు గమనిద్దాం. ఈ వారంలో గురు గ్రహం వృషభరాశిలో సంచరిస్తుండగా, కుజుడు మిథున రాశిలో, రవి బుధులు సింహరాశిలో, కన్యారాశిలో శుక్ర కేతువులు, కుంభరాశిలో వక్రీకరించినటువంటి శనీశ్వరుడు, మీనమందు రాహువు సంచరిస్తున్నారు. అలాగే చంద్రుడు కర్కాటక, సింహ, కన్య రాశులలో సంక్రమణం చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో చూద్దాం.

మేషం(Meesham)

ఈ రాశివారికి ఈ వారం సాధరణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది. ప్రత్యేకించి రెండు మూడు స్థానల యందు యోగిస్తున్నటువంటి గురు, కుజుల పూర్తి అనుకూలమైనటువంటి గ్రహ స్థితి, ఆ తర్వాత పంచమ స్థానమందు ఉన్న బుధ గ్రహం, షష్ట స్థానమందు ఉన్నటువంటి చంద్రుడు ఇలా నాలుగు గ్రహాల తాలూకు శుభఫలితాలు, శనేశ్వరుడు వక్రించినటువంటి స్థితి తోటి కలుపుకుని అయిదు గ్రహాల యొక్క స్థితి గతులు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులలో ఎదుగుదల కనిపిస్తోంది. పనులలో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల సాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి వస్తుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. ఎరుపు, తెలుపు రంగులు శుభప్రదం. వినాయకుడి ఆరాధన శ్రేయస్కరం.

వృషభం(Vrushbam)

ఈ రాశివారికి ఆత్మీయులతో స్వల్ప విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అయితే వెంటనే సర్దుబాటు కూడా అవుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. రావలసిన బాకీలు అందుతాయి. ఈవారం అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం జాగ్రత్త. తెలుగు, గులాబీ రంగులు మంచివి. శివుడిని ఆరాధించండి.

మిథునం (Mithunam)

ఈ రాశివారికి శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆర్ధిక ఇబ్బందులు చికాకు పుట్టిస్తాయి. అనుకున్న పనులు నత్త నడకన సాగుతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. నలుపు, నేరేడు రంగులు శ్రేయస్కరం. వినాయక స్తోత్రాన్ని పఠించండి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ పర్యటనలు ఉన్నాయి. స్వల్ప అనారోగ్యం. ఆకుపచ్చ, నీలం రంగుల దుస్తులు ధరించండి. అంతా మంచే జరుగుతుంది. అమ్మవారిని ఆరాధించండి.

సింహం(Simham)

ఈ రాశివారికి గత వారంతో పోలిస్తే ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. కాస్త మానసిక అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. ఎరుపు, గులాబీ రంగులు శుభప్రదం. మహాలక్ష్మిని ఆరాధించండి.

కన్య(Kanya)

ఈ రాశివారు ఈ వారం నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆలయాల సందర్శన ఉంది. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. . ఉద్యోగులకు శ్రమ ఎక్కువ. కళాకారులకు అనుకూలమైన వారం ఇది.. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు శ్రేయస్కరం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి.

తుల(Thula)

ఈ రాశివారు ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు . పుణ్యక్షేత్రాల సందర్శన ఉంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తల కృషి సఫలమవుతుంది. వారం మధ్యలో స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. నీలం, ఆకుపచ్చ రంగులు అనుకూలం. అమ్మవారిని ఆరాధించండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. కొత్త ఆశలు చిగురిస్తాయి. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌లు వచ్చే సమయం ఇది. విదేశీ పర్యటన ఉంది. వారం చివరలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆకుపచ్చ, నేరేడు రంగుల దుస్తులు వేసుకోండి. లింగాష్టకం పఠించండి.

ధనుస్సు(Dhanushu)

ఈ రాశివారు వివాదాలను చాలా తెలివిగా పరిష్కరించుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు అధికారుల మెప్పు లభిస్తుంది. . . వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి. ఎరుపు, లేత పసుపు రంగులు శుభప్రదం. దుర్గామాతను పూజించండి.

మకరం (Makaram)

ఈ రాశివారికి అనుకున్న ఆదాయం సమయానికి చేతికి అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు తప్పవు. అన్నదమ్ములతో చక్కగా ఉండండి. ఆకుపచ్చ, తెలుపు రంగులు శ్రేయస్కరం. నవగ్రహస్తోత్రాలు చదవండి.

కుంభం(Kumbam)

ఈ రాశివారు ముఖ్య కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది. సమాజంలో ఆదరణ లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. . ఉద్యోగులకు కలిసివస్తుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలో సమస్యలు. పసుపు, నేరేడు రంగులు మంచివి. ఆలయ సందర్శన మరవకండి.

మీనం..(Meenam)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్య నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. బాకీలు కొన్ని అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. వారం ప్రారంభంలో అధిక ఖర్చులు . గులాబీ, పసుపు రంగులు శ్రేయస్కరం. విష్ణుసహస్రనామాలను పఠించండి.

ehatv

ehatv

Next Story