మనిషికి ధనం 4 రూపాలలో వస్తుంది

మనిషికి ధనం 4 రూపాలలో వస్తుంది

1) యోగంద్వారా 2) అదృష్టం ద్వారా 3) ప్రాప్తము ద్వారా 4) శ్రమ ద్వారా.

1) యోగము: ఇది 3 రకాలుగా మారుతుంది.

1. ధనవంతునిగా పుట్టడం,

2. మధ్యవయసులో ఏదో ఒక వ్యాపారమో ఏదోఒక రూపంలో ఆకస్మాత్తుగా ధనవంతులు కావటం,

3. తన సంతానము ద్వారా వృద్దాప్యంలో సంపన్నుడు అవటం.

2) అదృష్టం: ఇది కూడా అంతే !

1. తాను పుట్టినప్పుడు తల్లిదండ్రులకు కలసివచ్చి ధనవంతులు అవటం,

2. తన జీవిత భాగస్వామి అడుగుపెట్టిన సమయము ద్వారా సంపన్నులు అవటం,

3. తన సంతానము ద్వారా ధనవంతులు అవటం.

3) ప్రాప్తము:

1. తనకు ఎవరో వ్రాసిన వీలునామా మూలకంగా ధనం రావటం,

2. నిధి, నిక్షేపాలు, దొరకటం,

3. ఏ లాటరీ ద్వారానో లేదా జూదవ్యసనం ద్వారానో ధనం రావటం.

ఈ ప్రాప్త్య ధనాన్ని అనుభవించే యోగ్యత చాలాతక్కువ.

4) శ్రమ: ద్వారా ధనము రావటం. ఇదే కలియుగములో సాథ్యం. మరే ఇతర విధములుగా ధనము రాదు.

ధనానికి నలుగురు శత్రువులు:-

1) అహంకారం

2) వ్యసనం

3) కామం

4) డాంభీకం

ఈ నాలుగూ లేకుంటే ధనం నిలుస్తుంది.

సామాన్యముగా ప్రాప్తము ద్వారా వచ్చే ధనము వారు ఉన్నంతవరకూ ఉంటుంది, తరువాత పోతుంది.

మనము చాలామంది విషయంలో వింటూవుంటాము, చూస్తూవుంటాము, పెద్దలు ఇచ్చిన ఆస్థిని కరిగించివేసిన కారణంగా పిల్లలు రోడ్డుమీద ఉన్నారని కారణం ఇదే!

సాధారణముగా గురువులు కానీ, మరెవరైనా కానీ, ప్రాప్తాన్ని మార్చలేరు. కానీ సద్గురువుల సాంగత్యంలో యోగాన్ని మార్చవచ్చు.

ప్రతిజీవికి ఎక్కడో ఒకచోట ధనయోగం ఉంటుంది. దాన్ని ముందుకు తీసుకురావచ్చు. మంత్రము ద్వారా కానీ, తంత్రము ద్వారా కానీ, పొందవచ్చు. ఇది మార్చాలంటే జాతకం లేదా ధ్యానము ద్వారా చేయవచ్చు. ప్రయత్నం, భయభక్తులుతో సాధన ద్వారా దైవానుగ్రహం అవసరం. అంటే కొంత శక్తి ని ధారపోసి చూడాలి.

ehatv

ehatv

Next Story