జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం ఈ రోజు ఆ రాశి వారు శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు.
తేదీ: 15-08-2024
వారం: గురువారం
తిథి: దశమి ఉదయం 10:26 నిమిషాల వరకు
నక్షత్రం: జేష్ట్య నక్షత్రం మ.12:52 నిమిషాల వరకు
వర్జ్యం: లేదు
శుభసమయం: ఉ.7.40 నుంచి 8.30 వరకు, సా.4.30 నుంచి 5.15 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.05 నుంచి 10:55 నిమిషాల వరకు, మ.3.08 నుంచి 3.58 వరకు
మేషరాశి (Mesham) :
ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన గొడవల్లో మీ పేరును తీసుకునే ప్రయత్నం చేస్తారు. మీ పిల్లలపై వచ్చిన తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు అహర్నిషలు కష్టపడతారు.
వృషభరాశి (Vrushabam):
వృత్తి, ఉద్యోగాల రహస్య సమాచారం ఇతరులకు చేరడంతో మీ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఇంట్లో వారు అనే అవకాశం ఉంది. దీంతో మీరు కొంత వేదనకు గురయ్యే అవకాశం ఉంది.
మిథునరాశి (Mithunam):
జీవిత భాగస్వామి ఆరోగ్య పరిస్థితుల్లో చాలా జాగ్రాత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సంతాన సంబంధిత విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి (Karkatakam):
అనుమానాస్పద వ్యక్తులు తారస పడుతారు. వీరి వల్ల ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. వీరి వల్ల ఆర్థికంగా నష్టం తప్ప ఎలాంటి ప్రయజనం లేదని మీరు గ్రహిస్తారు.
సింహరాశి (simham):
మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకెళ్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.మీరు చేసిన పని నచ్చక మిమ్మల్ని బదిలీ చేయాలని కొందరు ప్రయత్నిస్తారు
కన్యారాశి(Kanya):
కొన్ని విషయాల్లో నిస్వార్థంగా వ్యవహరించడం కూడా నేరంగా మారుతుంది. సరే కొన్ని కొన్ని విషయాల్లో మంచికి వెళ్తే చెడు జరిగిందని మీకు మీరే సర్దిచెప్పుకుంటారు.
తులారాశి (Thula):
మంచి పనికి చేయడానికి కూడా అడ్డుకునే శత్రువర్గం ఉంది. దీంతో కొంత మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంది. వైరల్ ఫీవర్, గొంతుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది
వృశ్చికరాశి (Vruchikam):
ఉద్యోగాలు, వ్యాపారాల్లో కొంత మంది మీకు నచ్చరు. దీంతో వారిని ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో దూరంగా ఉంచుతారు. దీని వల్ల ఆర్థిక నష్టం కూడా జరిగే అవకాశం ఉంది.
ధనస్సు రాశి (Dhanussu):
పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు, వ్యక్తల ప్రవర్తనను అంచనా వేస్తారు. సమాజంలో అన్ని విషయాలు ధనంతోనే ముడిపడి ఉందని ఆలస్యంగానైనా తెలుసుకుంటారు.
మకరరాశి (Makaram):
అమ్మకాలకు సంబంధించిన ఒప్పందాలు ఖరారు చేసుకునే అవకాశాలు వస్తాయి. అనుకున్న ఆస్తుల విలువ పెరగకున్నా అనుకోని ఆస్తుల విలువ అమాంతంగా పెరిగే అవకాశాలున్నాయి.
కుంభరాశి (Kumbam):
ఉద్యోగాలు, వ్యాపారపరిస్థితుల్లో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సర్దుకుపోవడమే వివేకమని అనుకుంటారు. కుటుంబాన్ని వృద్ధిలోకి తెచ్చేందుకు నిర్విరామంగా శ్రమిస్తారు.
మీనరాశి(Meenam):
సరైన సలహాదారులు, నమ్మకస్తులైన వ్యక్తులు దూరం కావడంతో మీకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అహర్నిషలు కష్టపడతారు.