Today Rasi Phalalu : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు.
Today Rasi Phalalu : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది.
మేషం(Mesham) :
పనుల్లో ఇబ్బందులు తొలిగిపోయే అవకాశం ఉంది. ప్రతి పనిలో ప్రతికూల ఫలితాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది.
వృషభం(Vrushabam) :
ఈ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది. దావత్‌లు, పార్టీలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మిథునం(Mithunam) :
కుటుంబ పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఓపిక వహించడం అన్నివిధాలా మేలు చేస్తుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్యంతో కొంత ఔషధాలు వాడే అవకాశం ఉంది.
కర్కాటకం(Karkatakam) :
కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.
సింహం(simham) :
మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. నూతనకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకోవాలి. ఘర్షణ జరిగే సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలను చేపట్టరు.
కన్య(Kanya) :
కుటుంబ పరిస్థితులు సంతృప్తినిస్తాయి. ఆకస్మిక ధనలాభంతో కొంతమేర రుణబాధలు తొలగిపోతాయి. మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
తుల(Thula) :
మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా. అకాల భోజనం వల్ల అనారోగ్యాన్ని అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉంటే మంచిది
వృశ్చికం(Vruchikam) :
ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రువల నుంచి బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది
ధనుస్సు(Dhanussu) :
కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. కొంత ఆవేదన పడతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతనకార్యాలు వాయిదావేసుకోక తప్పదు.
మకరం (Makaram):
బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఆందోళన ఎక్కువ అయినా అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అప్రతిష్టపాలవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతనకార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
కుంభం(Kumbam) :
ఒకటి కోరుకుంటే మరోటి జరుగుతుంది. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. సకాలంలో భుజించడానికి ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి
మీనం(Meenam) :
ఈ రాశివారి నడవడికను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో కూడా విజయం చేకూరుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలు తీసుకునే అవకాశం ఉంది.