ఈ రాశివారికి సొంత ఊళ్లకు బదిలీ అయ్యే అవకాశం!

13.08.2024, మంగళవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

శ్రావణ మాసం - శుక్ల పక్షం

తిథి:నవమి తె5.35 వరకు

వారం:మంగళవారం

(భౌమవాసరే)

నక్షత్రం:విశాఖ ఉ7.30 వరకు

యోగం:బ్రహ్మం మ2.30 వరకు

కరణం:బాలువ సా5.13 వరకు

తదుపరి కౌలువ తె5.35 వరకు

వర్జ్యం:ఉ11.45 - 1.26

దుర్ముహూర్తము:ఉ8.16 - 9.07

మరల రా10.56 - 11.41

అమృతకాలం:రా9.55 - 11.37

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:కర్కాటకం

చంద్రరాశి: వృశ్చికం

సూర్యోదయం:5.45

సూర్యాస్తమయం:6.24

మేషం(Mesham)

ఈ రాశివారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో కాస్త అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సకాలంలో డబ్బు అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి. ఓ వార్త కొంచెం బాధ కలిగిస్తుంది. శివారాధన చేయడం శ్రేయస్కరం.

వృషభం(Vrushabam)

ఈ రాశివారికి అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత ఉంది. పెద్దల నుంచి సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ఖర్చు ఉంటుంది. సూర్య స్తోత్రం చదివితే మంచిది.

మిథునం(Mithunam)

కుటుంబంతో హాయిగా గడుపుతారు. పెద్దలతో పరిచయం ఏర్పడుతుంది. శుభవార్తలు మీ మనసుకు ప్రశాంతతనిస్తాయి. సమస్యలను తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.

కర్కాటకం(Karkatam)

ఈ రాశివారికి ఇవాళ అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. మీ ప్రతిభను పది మంది మెచ్చుకుంటారు. కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. శని ధ్యాన శ్లోకం పఠించాలి.

సింహం(Simha)

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. వృథా ప్రయాణాలు చేయకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.

కన్య(Kanya)

ఈ రాశివారు ఒక శుభవార్త వింటారు. ఉద్యోగులకు సొంత ఊళ్లకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. మీ సమయస్ఫూర్తిని అధికారులు ప్రశంసిస్తారు శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుంది.

తుల(Thula)

మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు సఫలం అవుతాయి. శివస్తోత్రం చదవడం శుభకరం.

వృశ్చికం(Vruchikam)

శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారాస్తోత్రం చదవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు(Dhanussu)

కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి నుంచి ప్రశంసలు పొందుతారు. విందు,వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. శనిశ్లోకం పఠించండి.

మకరం(Makaram)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. విందు, వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మర్చిపోవద్దు.

కుంభం(Kumbam)

ఈ రాశివారికి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటుచేసుకుంటాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మీ మనసుకు బాధ కలిగిస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

మీనం(Meenam)

మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. మంచి మనస్సుతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శ్రీలక్ష్మీనారాయణ సందర్శనం శుభప్రదం.

Eha Tv

Eha Tv

Next Story