ఈ రాశివారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి.

తేది : 27-ఆగష్టు -2024

సంవత్సరం : శ్రీ క్రోధినామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

మాసం : శ్రావణ మాసం

ఋతువు : వర్ష ఋతువు

వారము : మంగళవారం

పక్షం : కృష్ణ పక్షము

తిథి : అష్టమి

(ఈరోజు ఉదయం 6 గం 38 ని వరకు)

నవమి

రాత్రి తెల్లవారుజామున 5గం 2ని వరకు

⭐నక్షత్రం : రోహిణి

ఈరోజు రాత్రి 8 గం 19 ని వరకు

వర్జ్యం : ( ఈరోజు పగలు 12 గం 36 ని నుండి 2 గం 08 ని వరకు

పునః రాత్రి 1గం 47ని నుండి 3గం 20ని వరకు

అమ్రుతఘడియలు : ఈరోజు సాయంత్రం 5 గం 24 ని నుండి 6 గం 56 ని వరకు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 24 ని॥ నుంచి 9 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 48 ని॥ నుంచి 11గం॥ 36 ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు పగలు 3 గం॥ 00 ని॥ నుంచి 4 గం॥ 30 ని॥ వరకు)

☀️సూర్యోదయం : ఉదయం 5 గం॥ 48 ని॥ లకు.

🌤️సూర్యాస్తమయం : సాయంత్రం 6గం॥ 17 ని ॥ లకు.

మేషం (Mesham)

ఈ రాశివారికి ఇవాళ అనుకూలంగానే ఉంది. మీరు చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. బుద్ధిబలం బాగుండటం వల్ల కొన్ని కీలక వ్యవహారాలలో నుంచి బయటపడగలుగుతారు. లక్ష్మీదేవిని ఆరాధించండి. అంతా మంచే జరుగుతుంది.

వృషభం (Vrushabam)

ఈ రాశివారికి ఇవాళ శుభదినం. అనుకున్నది సాధిస్తారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రియమైన వారితో గడుపుతారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.

మిథునం (Mithunam)

ఈ రాశివారికి ఇది మిశ్రమకాలం. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలపై దృష్టి పెట్టండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఆత్మ విశ్వాసం కోల్పోకూడదు. శ్రీ కృష్ణభగవానుడు మేలు చేస్తాడు.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో మేలైన ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవిని ఆరాధించండి.

సింహం(Simham)

ఈ రాశివారికి అన్నింటా మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అంత అనుకూలంగా లేదు. శ్రమ పెరుగుతుంది. ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. హనుమాన్‌ చాలీసాను పఠించండి. శుభం జరుగుతుంది.

కన్య (Kanyka)

ఈ రాశివారు అప్రమత్తతతో మెలగడం అవసరం. బంధు, మిత్రులను సంప్రదించకుండా ఎలాంటి తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ధనవ్యయం సూచితం. శివారాధన చేయండి.

తుల (Thula)

ఈ రాశివారికి అంతా అనుకూలంగానే ఉంది. ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొంటారు. అధికారులు మీ అభివృద్దికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. అమ్మవారిని పూజించండి.

వృశ్చికం (Vruchikam)

ఈ రాశివారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. భవిష్యత్తు ప్రణాళికలలో కొన్నింటిని అమలు చేస్తారు. సహచరులతో మంచిగా ఉండండి. నవగ్రహాలను పూజించండి.

ధనుస్సు (Dhanusham)

ఈ రాశివారు ప్రారంభించబోయే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కీలకమైన వ్యవహారాలు పూర్తవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. గురు ఆరాధన శుభప్రదం.

మకరం (Makaram)

ఈ రాశివారికి ఇవాళ మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.

కుంభం (Kumbam)

ఈ రాశివారికి వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన సమయం. మీ మీ రంగాల్లో అభివృద్ధి ఉంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలయ సందర్శన శ్రేయస్కరం.

మీనం (Meenam)

ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఉంది. శ్రీకృష్ణపరమాత్మను ఆరాధించండి.

ehatv

ehatv

Next Story