ఈ రాశివారికి సౌభాగ్య సిద్ధి ఉంది!

తేదీ 25 -ఆగష్టు -2024

సంవత్సరం : శ్రీ క్రోధినామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

ఋతువు : వర్ష ఋతువు

మాసము ;- శ్రావణ మాసం

పక్షం : కృష్ణ పక్షము

తిథి : సప్తమి

(ఈరోజు పగలు 12 గం 51 ని వరకు)

వారము:- ఆదివారం

నక్షత్రం : భరణి

వర్జ్యం : పగలు 04:20 నుంచి 05:52 వరకు

అమ్రుతఘడియలు:-మధ్యాహ్నం 12:13 నుంచి 1:43 వరకు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 06 గం॥ 00ని॥ నుంచి 07 గం॥ 36ని॥ వరకు)

రాహుకాలం : ఉదయం 4:58 నుంచి 6:31 వరకు

సూర్యోదయం : ఉదయం 6:05 గంటలకు

సూర్యాస్తమయం : సాయంత్రం 6:31 గంటలకు మేషం

మేషం (Mesham)

ఈ రాశివారు ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. ద్వాదశ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. వేళకు భోజనం చేయాలి. వేళకు పడుకోవాలి. శ్రిమన్నారాయణుడిని స్మరించుకోవాలి.

వృషభం(Vrushabham)

ఈ రాశివారు దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. అమ్మవారిని ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుంది.

మిథునం(Mithunam)

ఈ రాశివారికి ఈరోజు తిరుగే లేదు. అంతటా విజయాలే చేకూరుతాయి. సత్ఫలితాలు లభిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవాన్ని ఆరాధించండి

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చేపట్టిన పనులను శ్రద్ధగా చేస్తే విజయం లభిస్తుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహాలను పూజించండి. లాభం కలుగుతుంది.

సింహం(simham)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించుకోండి. బంధుమిత్రులతో సంబరంగా గడపుతారు. . కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

కన్య(Kanya)

ఈ రాశివారికి అత్యంత అనుకూలమైన రోజు ఇది. ప్రారంభించిన పనులలో విజయం చేకూరుతుంది. ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నరసింహస్వామిని దర్శించుకోండి.

తుల(Thula)

ఈ రాశివారికి మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి, మంచి ఫలితాలు సొంతం అవుతాయి. అతిగా ఎవరినీ విశ్వసించకండి. సీతారాములను కొలవండి.

వృశ్చికం (Vruchikam)

ఈ రాశివారికి సౌభాగ్యసిద్ధి ఉంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. భోజన సౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విఘ్నేశ్వరుడిని పూజించండి.

ధనుస్సు(Dhanusu)

ఈ రాశివారికి శుభకాలం. కార్యసిద్ధి ఉంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గాదేవి ఆరాధన శ్రేయస్కరం.

మకరం(Makaram)

ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆర్థికలావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. మహావిష్ణువును పూజించండి.

కుంభం(Kumbam)

ఈ రాశివారు అప్రమత్తంగా ఉండటం అవసరం. . ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఆవేశాలకు పోకూడదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. లింగాష్టకం చదవడం వల్ల పనులలో విజయంతో పాటు మంచి జరుగుతుంది.

మీనం(Meenam)

ఈ రాశివారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్ధిక పరంగా జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ధ్యానం వల్ల మేలు జరుగుతుంది..

Updated On 25 Aug 2024 2:30 AM GMT
Eha Tv

Eha Tv

Next Story