ఈ రాశివారికి కష్టపడినా ఫలితం దక్కదు!

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: ఏకాదశి ప.05.49 తదుపరి ద్వాదశి , నక్షత్రం: మూల ప 12.43 వరకు తదుపరి పూర్వాషాఢ వర్జ్యం: ఉ.9.57 నుంచి 11.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు, తదుపరి ప.12.28 నుండి 1.12 వరకు. ఈ రోజు వరలక్ష్మి వ్రతం.

మేషం(Mesham)

ఈ రాశివారు ఇవాళ కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. భూలాభాలు. ఉద్యోగావకాశాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృషభం(Vrushabam)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో గొడవలు జరిగే అవకాశం ఉంది. మానసిక అశాంతి. ఉద్యోగులకు పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవ దర్శనం చేయండి.

మిథునం(Mithunam)

ఈ రాశివారికి కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరులు, సోదరులతో కలహాలు. రుణయత్నాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం(Karkatakam)

పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. బాల్య స్నేహితులను కలుసుకుంటారు. విందువినోదాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

సింహం(simha)

రుణదాతల ఒత్తిడులు వస్తాయి. అనుకున్న పనుల్లో జాప్యం జరుగుతుంది. సోదరులతో తగాదాలు ఏర్పడతాయి. దూరప్రయాణాలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి ఉంటుంది.

కన్య(Kanya)

ఈ రాశివారు పనులు సమయానికి పూర్తి చేస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. భూ, వాహనయోగం. ముఖ్య వ్యవహారాలలో చర్చలు సఫలం. దైవదర్శనాలు. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు కలిగే అవకాశం ఉంది.

తుల(Thula)

కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.

వృశ్చికం(Vruchikam): ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలోకొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మరింత అనుకూలత..

ధనుస్సు(Dhanussu)

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు.. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

మకరం(Makaram)

ఈ రాశివారు కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

కుంభం(Kumbam)

ఈ రాశివారికి ఇవాళ అంత అనుకూలంగా లేదు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మీనం(Meenam)

ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తిలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఊరట కలుగుతుంది. సమాజసేవలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి.

Updated On 16 Aug 2024 2:30 AM GMT
Eha Tv

Eha Tv

Next Story