Today Rasi Phalalu : ఈ రాశివారికి చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి
చేపట్టిన ప్రయత్నాలు ఫలిస్తాయి
తేదీ 14 -సెప్టెంబరు -2024
సంవత్సరం : శ్రీ క్రోధినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయనం
ఋతువు : వర్ష ఋతువు
మాసము ;- భాద్రపద మాసం
పక్షం : శుక్ల పక్షము
తిథి : ఏకాదశి
(ఈరోజు సాయంత్రం 4 గం 15 ని వరకు)
వారము:- శనివారం
⭐నక్షత్రం : ఉత్తరాషాఢ
( ఈరోజు సాయంత్రం 5 గం 32 ని వరకు)
వర్జ్యం : రాత్రి 9గం 24ని నుండి 10గం 57 ని వరకు
అమ్రుతఘడియలు:- పగలు 11 గం 26 ని నుండి 1 గం 00 ని వరకు
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 06 గం॥ 00ని॥ నుంచి 07 గం॥ 36ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 09 గం॥ 00 ని॥ నుంచి 10గం॥ 30 ని॥ వరకు)
☀️సూర్యోదయం : ఉదయం 5 గం॥ 50 ని॥ లకు.
🌤సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 03 ని॥ లకు.
మేషం (Mesham) : ఈ రాశివారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్ధిక పరంగా జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ధ్యానం వల్ల మేలు జరుగుతుంది.
వృషభం(Vrushabham) : ఈ రాశివారు దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. అమ్మవారిని ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుంది. మిథునం(Mithunam) ఈ రాశివారికి ఈరోజు తిరుగే లేదు. అంతటా విజయాలే చేకూరుతాయి. సత్ఫలితాలు లభిస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్ట దైవాన్ని ఆరాధించండి
కర్కాటకం(Karkatakam) : ఈ రాశివారు ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. ద్వాదశ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. వేళకు భోజనం చేయాలి. వేళకు పడుకోవాలి. శ్రిమన్నారాయణుడిని స్మరించుకోవాలి.
సింహం(simham) : ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆర్థికలావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. మహావిష్ణువును పూజించండి.
కన్య(Kanya) : ఈ రాశివారికి అత్యంత అనుకూలమైన రోజు ఇది. ప్రారంభించిన పనులలో విజయం చేకూరుతుంది. ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నరసింహస్వామిని దర్శించుకోండి.
తుల(Thula) : ఈ రాశివారికి మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రారంభించిన కార్యక్రమాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి, మంచి ఫలితాలు సొంతం అవుతాయి. అతిగా ఎవరినీ విశ్వసించకండి. సీతారాములను కొలవండి.
వృశ్చికం (Vruchikam) : ఈ రాశివారు అప్రమత్తంగా ఉండటం అవసరం. . ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఆవేశాలకు పోకూడదు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. లింగాష్టకం చదవడం వల్ల పనులలో విజయంతో పాటు మంచి జరుగుతుంది.
ధనుస్సు(Dhanusu) : ఈ రాశివారికి ఇది మిశ్రమకాలం. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలపై దృష్టి పెట్టండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. ఆత్మ విశ్వాసం కోల్పోకూడదు. శ్రీ కృష్ణభగవానుడు మేలు చేస్తాడు.
మకరం(Makaram) : ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆర్థికలావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. మహావిష్ణువును పూజించండి.
కుంభం(Kumbam) : ఈ రాశివారికి శుభకాలం. కార్యసిద్ధి ఉంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గాదేవి ఆరాధన శ్రేయస్కరం.
మీనం(Meenam) : ఈ రాశివారికి సౌభాగ్యసిద్ధి ఉంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. భోజన సౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విఘ్నేశ్వరుడిని పూజించండి.