ఈ రాశి వారు బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది.

తేదీ:- 5, డిసెంబరు 2024

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- దక్షిణాయనం

ఋతువు:- హేమంత

మాసం:- మార్గశీర్ష మాసం

పక్షం:- శుక్ల పక్షం

తిథి:- చవితి ఉ.11.49 వరకు

వారం:- గురువారం (బృహస్పతివాసరే)

నక్షత్రం:- ఉత్తరాషాఢ సా.5.09 వరకు

యోగం:- వృద్ధి మ.12.58 వరకు

కరణం:- భద్ర ఉ.11.49 వరకు తదుపరి బవ రా.11.18 వరకు

వర్జ్యం:- రా.9.04 - 10.38

దుర్ముహూర్తము:- ఉ.10.00 - 10.44 వరకు

మరల మ.2.24 - 3.08

అమృతకాలం:- ఉ10.46 - 12.22 వరకు

రాహుకాలం:- మ1.30 - 3.00 వరకు

యమగండ/కేతుకాలం:- ఉ.6.00 - 7.30 వరకు

సూర్యరాశి:- వృశ్చికం

చంద్రరాశి: మకరం

సూర్యోదయం:- 6.20 సూర్యాస్తమయం:- 5.21


మేషం

ఈ రాశి వారు బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు. శివారాధన చేయండి. మేలు జరుగుతుంది.



వృషభం

ఈ రాశి వారు ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. దుర్గా మాతను పూజించండి.


మిథునం

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. మనన్రాన్ని కలిగి ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.


కర్కాటకం

ఈ రాశి వారికి ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. మహా విష్ణువును పూజించండి.


సింహం

ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. నవగ్రహ ప్రదక్షణ చేయండి.


క‌న్య

ఈ రాశి వారు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హానితలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. ఇష్ట దైవాన్ని ప్రార్ధించండి.



తుల‌

ఈ రాశి వారు ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు. హనుమాన్ చాలీసా చదవండి.


వృశ్చికం

ఈ రాశి వారు నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. అమ్మవారిని ఆరాధించండి.


ధ‌నుస్సు

ఈ రాశి వారు పిల్లలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు. రామాలయ సందర్శన మంచిది.


మకరం

ఈ రాశి వారికి అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. కుల దైవాన్ని ప్రార్ధించండి.


కుంభం

ఈ రాశి వారు బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. మహా విష్ణువును పూజించండి.


మీనం

ఈ రాశి వారు నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శివ పార్వతుల దర్శనం చేసుకోండి.

ehatv

ehatv

Next Story