ఈ రాశివారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి!

తేది : 16, సెప్టెంబర్ 2024

సంవత్సరం : శ్రీ క్రోధినామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

మాసం : భాద్రపద మాసం

ఋతువు : వర్ష ఋతువు

వారము : సోమవారం

పక్షం : శుక్ల పక్షము

తిథి : త్రయోదశి

(ఈరోజు పగలు 1 గం 1 ని వరకు)

⭐నక్షత్రం : ధనిష్ఠ

( ఈరోజు పగలు 3 గం 40 ని వరకు )

వర్జ్యం :

ఈరోజు రాత్రి 10 గం 28 ని నుండి 11 గం 59 ని వరకు

అమ్రుతఘడియలు : ఉదయం 5గం 58 ని నుండి 7గం 09ని వరకు

దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12గం॥ 24 ని॥ నుంచి1 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు పగలు 2 గం॥ 48 ని॥ నుంచి 3 గం॥ 36 ని॥ వరకు)

రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి 9 గం॥ 00 ని॥ వరకు)

సూర్యోదయం : ఉదయం 5 గం॥ 50 ని॥ లకు

సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 03 ని॥ లకు.

మేషం(Mesham)

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మనసు చెడు విషయాల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసర ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామిని పూజించండి.

వృషభం(Vrushabham)

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. శారీరక శ్రమ అధికం అవుతుంది. వాదులాటకు దూరంగా ఉండటమే మంచిది. నవగ్రహపూజలు చేయండి.

మిథునం(Mithunam)

మిశ్రమ వాతావరణం కలదు. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనపడతారు. శివాలయ సందర్శనం శ్రేయస్కరం.

కర్కాటకం(karkatakam)

ప్రారంభించబోయే పనుల్లో మంచిఫలితాలు రాబడతారు. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. దుర్గాదేవిని ఆరాధించండి.

సింహం(Simham)

ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం.

కన్య(Kanya)

చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. వినాయకుడి ఆరాధన శ్రేయస్కరం.

తుల(thula)

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా పఠించండి.

వృశ్చికం(Vruchikam)

శుభకాలం. మీ మీ రంగాల్లో చక్కటి శుభఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.

ధనుస్సు(dhanusu)

ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

మకరం(Makaram)

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.

కుంభం(Kumbham)

అనుకున్న ఫలితాలు వెలువడుతాయి. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపతాపాలకు పోవద్దు. మనసు చెడు విషయాల మీదకు మళ్లుతుంది.శివారాధన మంచిది.

మీనం(Meenam)

కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. లక్ష్మీపూజ చేయండి.

Eha Tv

Eha Tv

Next Story