Today Rasi Phalalu : ఈ రోజు మీకు శుభకాలం కొనసాగుతోంది
ఈ రోజు మీకు శుభకాలం కొనసాగుతోంది
30-09-2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం;
వర్ష రుతువు, భాద్రపదమాసం, బహుళపక్షం
త్రయోదశి:
రా. 7-00 తదుపరి చతుర్దశి మఖ:
ఉ. 7-43 తదుపరి పుబ్బ
వర్జ్యం:
సా.4-27 నుంచి 6-12 వరకు
అమృత ఘడియలు:
ఉ. 6-51 వరకు తిరిగి రా. 2-57 నుంచి 4-42 వరకు
దుర్ముహూర్తం:
మ. 12-14 నుంచి 1-02 వరకు తిరిగి 2-38 నుంచి 3-25 వరకు
రాహుకాలం:
ఉ. 7-30 నుంచి 9-00 వరకు సూర్యోదయం: ఉ. 5.53; సూర్యాస్తమయం: సా.5.49
మేషం
ఈ రాశివారికి భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం..
వృషభం
ఈ రాశివారికి ఇది శుభకాలం. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి.
మిథునం
ఈ రాశివారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.
కర్కాటకం
ఈ రాశివారికి మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.
సింహం
ఈ రాశివారు మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.
కన్య
ఈ రాశివారికి కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
తుల
ఈ రాశివారికి ఇది మిశ్రమకాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి, తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. చంద్ర ధ్యానం శుభప్రదం.
వృశ్చికం
ఈ రాశివారికి బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.
ధనుస్సు
ఈ రాశి వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొంటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది.
మకరం
ఈ రాశివారు మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బంది పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.
కుంభం
ఈ రాశివారికి ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.
మీనం
ఈ రాశివారికి తమ తమ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.