ఈ రాశివారికి దీపావళి కాంతులే!

తేదీ:- 30, అక్టోబరు 2024

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- దక్షిణాయణం

ఋతువు:- శరదృతువు

మాసం:- ఆశ్వయుజ పక్షం:- బహళ పక్షం

తిథి:- త్రయోదశి మ.12.17 వరకు

వారం:- బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం:- హస్త రా.9.44 వరకు

యోగం:- వైధృతి ఉ.9.20 వరకు

కరణం:- వణిజ మ.12.35 వరకు తదుపరి భద్ర రా.1.39 వరకు

వర్జ్యం:- ఉ.శే.వ. 6.30 వరకు

దుర్ముహూర్తము:- ఉ.11.21 - 12.06

మరల రా.10.28 - 11.18 వరకు

అమృతకాలం:- మ.3.22 - 5.08 వరకు

రాహుకాలం:- మ12.00 - 1.30 వరకు

యమగండ/కేతుకాలం:- ఉ.7.30 - 9.00

సూర్యరాశి:- తుల

చంద్రరాశి:- కన్య

సూర్యోదయం:- 6.01

సూర్యాస్తమయం:- 5.27

మేషం(Mesham)

ఈ రాశివారికి ఇది శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య పనులను మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మీ దేవి సందర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభం(Vrushabam)

ఈ రాశివారికి తమ తమ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడవలసి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్ని సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీసహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.

మిథునం(Mithunam)

ఈ రాశివారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దైవారాదన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.

కర్కాటకం(Karkatam)

ఈ రాశివారికి వారి పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది.

సింహం(Simhanm)

ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

కన్య(Kanya)

ఈ రాశివారికి ఇది శుభ కాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. సకాలంలో సహాయం చేసేవారున్నారు. శివారాధన చేయడం మంచిది.

తుల(Thula)

ఈ రాశివారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహకారం అందుకుంది. మనస్సౌఖ్యం ఉంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి వారి స్వధర్మం వారిని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతత ను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

ధనుస్సు(dhanussu)

ఈ రాశివారికి శ్రమకు తగ్గ ఫలితాలుంటాయి. ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారముతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. సాయి నామాన్ని జపించాలి.

మకరం(Makaram)

ఈ రాశివారికి కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. బంధుమిత్రుల వలన మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

కుంభం(Kumbham)

ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితాలుంటాయి. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్య పనులను త్వరగా పూర్తయ్యేవిధంగా ప్రణాలికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మీనం(Meenam)

ఈ రాశివారు చేపట్టేపనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగడానికై వేంకటేశ్వరుణ్ణి పూజించాలి.

Eha Tv

Eha Tv

Next Story