ఈ రాశివారికి ఆకస్మిక ధన లబ్ధి

పంచాంగము 🌓 29.09.2024

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: వర్ష

మాసం: భాద్రపద

పక్షం: కృష్ణ - బహుళ

తిథి: ద్వాదశి సా.05:54 వరకు

తదుపరి త్రయోదశి

వారం: ఆదివారం - భానువాసరే

నక్షత్రం: ఆశ్లేష ఉ‌.06:16 వరకు

తదుపరి మఘ

యోగం: సాద్య రా.12:25 వరకు

తదుపరి శుభ

కరణం: తైతుల సా.05:54 వరకు

తదుపరి గరజ

వర్జ్యం: రా.07:12 - 08:55 వరకు

దుర్ముహూర్తం: సా.16:30 - 05:18

రాహు కాలం: సా.04:36 - 06:06

గుళిక కాలం: ప‌.03:06 - 04:36

యమ గండం: ప‌.12:06 - 01:36

అభిజిత్: 11:42 - 12:30

సూర్యోదయం: 06:05

సూర్యాస్తమయం: 06:06

చంద్రోదయం: రా.03:12

చంద్రాస్తమయం: సా.04:14

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: సింహం

దిశ శూల: పశ్చిమం

🌾 యతి ద్వాదశి 🌾

💫 దగ్ధయోగము 💫

🪷 ఉపేంద్ర ద్వాదశి 🪷

మేషం

ఈ రాశివారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగుల యత్నాలు అనుకూలించవు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శివారాధాన మంచిది.

వృషభం

ఈ రాశివారికి పనులు మధ్యలోనే విరమిస్తారు. పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శ్రేయస్కరం.

మిథునం

ఈ రాశివారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలబ్ధి. వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వృత్తి,వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. దుర్గాదేవిని ఆరాధించండి.

కర్కాటకం

ఈ రాశివారికి అంత అనుకూలంగా లేదు. రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. బంధుగణంతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్య సూచనలు. హనుమాన్‌ చాలీసా పఠించండి. మంచి జరుగుతుంది.

సింహం

ఈ రాశివారు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల సమస్య నుంచి విముక్తి. వాహనసౌఖ్యం. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. నవగ్రహ పూజ శ్రేయస్కరం.

కన్య

ఈ రాశివారికి మిత్రులే శత్రువులుగా మారతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు. శ్రమకు తగిన ఫలితం ఉండదు. అనారోగ్యం. భూవివాదాలు. వృత్తి,వ్యాపారాలలో ఒడిదుడుకులు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.

తుల

ఈ రాశివారికి నూతన ఉద్యోగయోగం ఉంది . చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. మీ కృషి ఫలించే సమయం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. వస్తులాభాలు. లక్ష్మీదేవికి పూజలు చేయండి.. శుభ ఫలితాలు కలుగుతాయి.

వృశ్చికం

ఈ రాశివారికి పనులలో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. మహావిష్ణువును పూజించండి.

ధనుస్సు

ఈ రాశివారు కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృథా ఖర్చులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఇష్ట దైవాన్ని ప్రార్థించండి.

మకరం

ఈ రాశివారికి వ్యవహారాలలో ఆటంకాలు ఏర్పడతాయి. దూరప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా. శ్రమ తప్పదు. సోదరులు, మిత్రులతో అకారణ వైరం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. ఆలయ సందర్శన ఉత్తమం.

కుంభం

ఈ రాశివారు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి. ఉద్యోగలాభం. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. రామాలయ సందర్శన శ్రేయస్కరం.

మీనం

ఈ రాశివారు ఓర్పుతో పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం.. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వాహనయోగం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

Eha Tv

Eha Tv

Next Story