ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు.
తేదీ:- 29, అక్టోబర్ 2024
సంవత్సరం:- శ్రీ క్రోధి నామ
అయనం:- దక్షిణాయణం
ఋతువు:- శరదృతువు
మాసం:- ఆశ్వయుజ పక్షం:- బహళ పక్షం
తిథి:- ద్వాదశి ఉ.10.16వరకు
వారం:- మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం:- ఉత్తర రా.7.08వరకు
యోగం:- ఐంద్రం ఉ.9.50 వరకు
కరణం:- తైతుల ఉ.10.32 వరకు తదుపరి గరజి రా.11.33 వరకు
వర్జ్యం:- తె.4.44 నుండి
దుర్ముహూర్తము:- ఉ.8.18 - 9.03 మరల రా.10.28 - 11.18 వరకు
అమృతకాలం:- ఉ.11.30 - 1.16 వరకు
రాహుకాలం:- మ.3.00 - 4.30 వరకు
యమగండ/కేతుకాలం:- ఉ.9.00 - 10.30
సూర్యరాశి:- తుల చంద్రరాశి:- కన్య
సూర్యోదయం:- 6.01 సూర్యాస్తమయం:- 5.27
పాఠకులందరికీ ధనతేరస్-ధనత్రయోదశి మరియు శ్రీ ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు
మేషం
ఈ రాశివారికి శుభఫలితాలున్నాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగ్గ ఫలితం వెంటనే నెరవేరుతుంది. ప్రశాంతత నెలకొంటుంది. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
వృషభం
ఈ రాశివారు చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యమవుతాయి. శ్రమ అధికమౌతుంది. కీలక విషయాల్లో సమయస్ఫూర్తిగా ఆలోచించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకుసాగాలి. శివ నామాన్ని జపించాలి.
మిథునం
ఈ రాశివారు తమదైన ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. గురు ధ్యానం శుభప్రదం.
కర్కాటకం
ఈ రాశివారు చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికి పట్టుదలతో పూర్తిచేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గ ధ్యానం చేస్తే మంచిది.
సింహం
ఈ రాశివారికి ఇది శుభసమయం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
కన్య
ఈ రాశివారికి తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదైవాన్ని ధ్యానించాలి.
తుల
ఈ రాశివారు అధికారులతో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. దుర్గా దేవి నామాన్ని జపించడం ఉత్తమం.
వృశ్చికం
ఈ రాశివారు సమయానుకూలంగా ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. అకారణ కలహ సూచన. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. దుర్గా ధ్యానం శుభప్రదం.
ధనుస్సు
ఈ రాశివారు మొదలుపెట్టిన పనులలో ఆటంకాలను అధికమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
మకరం
ఈ రాశివారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.
కుంభం
ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి లక్ష్మీధ్యానం శుభప్రదం.
మీనం
ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శని జపం చేసుకోవాలి.