ఈ రాశివారికి వారి వారి రంగాల్లో పనిభారం పెరుగుతుంది.
తేదీ:- 28, అక్టోబర్ 2024
సంవత్సరం:- శ్రీ క్రోధి నామ
అయనం:- దక్షిణాయణం
ఋతువు:- శరదృతువు
మాసం:- ఆశ్వయుజ
పక్షం:- బహళ పక్షం
తిథి:- ఏకాదశి ఉ.8.28 వరకు
వారం:- సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:- పుబ్బ సా.4.44 వరకు
యోగం:- బ్రహ్మం ఉ.9.30 వరకు
కరణం:- బాలువ ఉ.8.42 వరకు తదుపరి కౌలువ రా.9.36 వరకు
వర్జ్యం:- రా.12.57 - 2.42 వరకు
దుర్ముహూర్తము:- మ.12.06 - 12.52 మరల మ.2.24 - 3.10 వరకు
అమృతకాలం:- ఉ.10.05 - 11.49 వరకు
రాహుకాలం:- ఉ.7.30 - 9.00 వరకు
యమగండ/కేతుకాలం:- ఉ.10.30 - 12.00 వరకు
సూర్యరాశి:తుల
చంద్రరాశి:- సింహం
సూర్యోదయం:- 5.59 సూర్యాస్తమయం:- 5.31
మేషం
ఈ రాశివారికి చేపట్టే పనిలో ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. ఒక సంఘటన ఆనందాన్నిస్తుంది. ఆదిత్య హృదయం పఠిస్తే బాగుంటుంది.
వృషభం
ఈ రాశివారిని మనోధైర్యం సదా కాపాడుతుంది. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. భవిష్యత్తును దృష్టిలోపెట్టుకుని ముందడుగు వేయండి. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.
మిథునం
ఈ రాశివారికి వారి వారి రంగాల్లో పనిభారం పెరుగుతుంది. ఒత్తిడిని జయించేవిధంగా ముందుకుసాగాలి. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి.
కర్కాటకం
ఈ రాశివారికి ఇది శుభకాలం. బుద్ధిబలాన్నే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.
సింహం
ఈ రాశివారు సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.
కన్య
ఈ రాశివారికి ధర్మసిద్ధి ఉంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అర్థలాభం కలదు. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. దుర్గ స్తోత్రం పఠించాలి.
తుల
ఈ రాశివారికి శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శని ధ్యానం చేయాలి.
వృశ్చికం
ఈ రాశివారు ఒక శుభవార్త వింటారు. ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.
ధనుస్సు
ఈ రాశివారికి ఇది శుభకాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.
మకరం
ఈ రాశివారు తలపెట్టిన కార్యాన్ని పూర్తిచేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. మితంగా ఖర్చుచేయాలి. శ్రమ కాస్త పెరుగుతుంది. కుటుంబసభ్యులతో ప్రేమగా మెలగాలి. సాయి నామాన్ని స్మరించండి.
కుంభం
ఈ రాశివారికి కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇబ్బంది పెట్టే వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగుతాయి.
మీనం
ఈ రాశివారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దగ్గరివారిని కలుపుకొనిపోతే లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.