ఈ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు!

అక్టోబరు 27వ తేదీ నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు ఉండే గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభాఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. గురుడు వక్రించి వృషభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు నీచక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో ఉన్నాడు. కన్యారాశిలో కేతువు, తులారాశిలో రవిగ్రహం నీచ క్షేత్రంలో ఉన్నారు. వృశ్చిక రాశిలో శుక్ర, బుధులు ఉన్నారు. శనీశ్వరుడు వక్రించి కుంభ రాశిలో ఉన్నాడు. రాహువు వక్రగతిలో సహజంగానే మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. చంద్రుడు సింహరాశిలోనూ, కన్యారాశిలోనూ, తులారాశిలోనూ, వృశ్చిక రాశిలోనూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో ద్వాదశరాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో చూద్దాం.

మేషం

ఈ రాశివారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం ఉంటుంది.

వృషభం

ఈ రాశివారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆశించిన రాబడి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

మిథునం

ఈ రాశివారికి ఆర్థిక లావాదేవీలు మొదట్లో కొంత ఇబ్బంది కలిగిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెంపొందుతాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు.

కర్కాటకం

ఈ రాశివారికి పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.

సింహం

ఈ రాశివారికి పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబసభ్యులతో మనస్పర్థలు తొలగుతాయి. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వృథా ఖర్చులు.

కన్య

ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ధనలబ్ధి. వాహనయోగం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు.

తుల

ఈ రాశివారు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు చేదోడుగా నిలుస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు విజయవంతంగా సాగుతాయి. వారం చివరిలో మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

వృశ్చికం

ఈ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ఆశించినంతగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు అవార్డులు రావచ్చు. వారం మధ్యలో వృథా ఖర్చులు.

ధనుస్సు

ఈ రాశివారికి ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. చేపట్టిన కార్యక్రమాలను కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. గత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. స్థిరాస్తుల వివాదాలు కొలిక్కి రాగలవు. పలుకుబడి కలిగిన వారి నుండి సహకారం లభిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి వైపు పయనిస్తాయి. ఉద్యోగులు ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.

మకరం

ఈ రాశివారు చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. పోటీపరీక్షల్లో విజయం. విద్యార్థులకు కలసివచ్చే సమయం. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో అనూహ్యమైన ప్రగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు, అవార్డులు. వారం మధ్యలో వ్యయప్రయాసలు కలిగే అవకాశం ఉంది.

కుంభం

ఈ రాశివారు ఉత్సాహంతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో గందరగోళం తొలగుతుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వాహనాలు, భూములు కొంటారు. విద్యావకాశాలు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం.

మీనం

ఈ రాశివారు కొత్త వ్యూహాలు, నిర్ణయాలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, అంగారకస్తోత్రాలు పఠించండి.

Eha Tv

Eha Tv

Next Story