ఈ రాశివారు ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - బహుళ పక్షం

తిథి:నవమి సా4.25 వరకు

వారం:గురువారం(బృహస్పతివాసరే)

నక్షత్రం:పునర్వసు తె3.59 వరకు

యోగం:వరీయాన్ ఉ6.10 వరకు

తదుపరి పరిఘము తె4.49 వరకు

కరణం:గరజి సా4.25 వరకు

తదుపరి వణిజ తె4.22 వరకు

వర్జ్యం:మ3.50 - 5.27

దుర్ముహూర్తము:ఉ9.52 - 10.40

మరల మ2.40 - 3.28

అమృతకాలం;రా1.33 - 3.10

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి:కన్య

చంద్రరాశి: మిథునం

సూర్యోదయం:5.53

సూర్యాస్తమయం:5.53

మేషం (Mesham)

ఈ రాశివారు ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. శివాలయ సందర్శన శ్రేయస్కరం.

వృషభం(Vrushabam)

ఈ రాశివారికి అనుకూలంగానే ఉంది. వారు తమ తమ రంగాల్లో ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. సూర్యనారాయణుడి పూజ చేస్తే ఇంకా బాగుంటుంది.

మిథునం(Mithunam)

ఈ రాశివారు ప్రారంభించిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీలక్ష్మీదేవిని పూజించండి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశివారికి అనుకూలమైన రోజు ఇది. తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.

సింహం(Simham)

ఈ రాశివారికి ఇది మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తిపడక పోవచ్చు. అస్థిరనిర్ణయాలతో సతమతం అవుతారు. కలహాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు పఠించండి.

కన్య(Kanya)

ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. దుర్గాదేవిని పూజించండి.

తుల(Thula)

ఈ రాశివారు బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఇష్టదైవారాధన మంచిది.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తమ తమ రంగాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. గిట్టనివారితో మితభాషణం అవసరం. స్థాన చలనం సూచితం. అప్పుల వల్ల ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. శ్రీఆంజనేయస్వామిని పూజించండి.

ధనుస్సు(Dhanushu)

ఈ రాశివారికి పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శివారాధన శ్రేయస్కరం.

మకరం(Makaram)

ఈ రాశివారికి శుభకాలం. చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివారాధన వల్ల మేలు జరుగుతుంది.

కుంభం(Kubha)

ఈ రాశివారికి శ్రమ ఫలిస్తుంది. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు.ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. ఇష్టదైవారాధన శుభప్రదం.

మీనం(Meenam)

ఈ రాశివారు సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మహాలక్ష్మిని పూజించండి.

ehatv

ehatv

Next Story