ఈ రాశివారికి కార్యసిద్ధి ఉంది!

తేదీ:- 26, అక్టోబర్ 2024

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- దక్షిణాయణం

ఋతువు:- శరదృతువు

మాసం:- ఆశ్వయుజ

పక్షం:- బహళ పక్షం

తిథి:- దశమి పూర్తి

వారం:- శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:- ఆశ్లేష మ.1.02 వరకు

యోగం:- శుభం ఉ.9.49 వరకు

కరణం:- గరజి ఉ.6.18 వరకు తదుపరి వణిజ సా.6.47 వరకు

వర్జ్యం:- రా.2.09 - 3.51 వరకు

దుర్ముహూర్తము:- ఉ.6.00 - 7.31 వరకు

అమృతకాలం:- ఉ.11.38 - 1.19 వరకు

రాహుకాలం:- ఉ.9.00 - 10.30 వరకు

యమగండ/కేతుకాలం:- మ.1.30 - 3.00 వరకు

సూర్యరాశి:- తుల

చంద్రరాశి:- కర్కాటకం

సూర్యోదయం:- 5.59 సూర్యాస్తమయం:- 5.31


మేషరాశి

చేపట్టిన పనిని పట్టువదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలను కొన్ని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు బాధను కల్గిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచిఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

చేపట్టిన పనులలో తొందరపాటు మంచిదికాదు. ప్రత్యర్థుల నుంచి ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచనాలు కలుగతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు

మిధునరాశి

బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి,పశు,పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి

ఆదాయనికి మించి ఖర్చులుంటాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. బంధువులతో ఆకారణ విభేదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చికాకు పరుస్తాయి. కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి

సింహరాశి

కొత్త వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్తపడటం మంచిది. చేపట్టిన కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదరవైరం కలిగే అవకాశం ఉంటుంది.

కన్యారాశి

కొత్త కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పాహారం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంతవరకు అసత్యానికి దూరంగా ఉండటం మంచిది. అనవసర భయాందోళనలకు గురవుతారు.

తులారాశి

మంచి ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. చేపట్టిన పనులలో పురోగతి ఉంటుంది . మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ఇష్టదేవత స్తోత్రం పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి

వ్యాపార లక్ష్యాలను చేరుకోవడంలో జాగ్రత్త వహించాలి. డబ్బు, ఆరోగ్యం రెండూ బాగుంటాయి. ఈ మధ్య సొంత అవసరాల కంటే ఇతరులను సంతోషపెట్టడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తున్నారు.

ధనూ రాశి

ఈ రాశి వారు ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది. కొన్నిసార్లు మనం వెతుకుతున్న పరిష్కారాలు మన ముందు ఉంటాయి, కానీ గందరగోళం కారణంగా వాటిని చూడటంలో విఫలమవుతాము. మీకు వచ్చే మార్పులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి.

మకరం

శుభకార్య ప్రయత్నాలు సులువుగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.

కుంభం

గొప్ప వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల కారణంగా లాభాలు కలుగుతాయి. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులను గౌరవిస్తారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు

మీనరాశి

పెద్దలు సూచించిన మార్గంలో పయనించి మంచి ఫలితాలను సాధిస్తారు. ధనధాన్య లాభాలున్నాయి. కొత్త వస్తువులను సేకరిస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం

Eha Tv

Eha Tv

Next Story