ఈ రాశివారికి విజయసిద్ధి ఉంది!

25.10.2024, శుక్రవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం

తిథి:నవమి పూర్తి

వారం:భృగువాసరే

(శుక్రవారం)

నక్షత్రం:పుష్యమి మ12.08 వరకు

యోగం:సాధ్యం ఉ10.31 వరకు

కరణం:తైతుల సా6.07 వరకు

తదుపరి గరజి తె5.57 వరకు

వర్జ్యం:రా1.33 - 3.14 వరకు

దుర్ముహూర్తము:ఉ8.17 - 9.03

మరల మ12.08 - 12.54

అమృతకాలం:ఉ7.11వరకు

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:తుల

చంద్రరాశి: కర్కాటకం

సూర్యోదయం:5.59

సూర్యాస్తమయం:5.31

మేషం

ఈ రాశివారికి కార్యసిద్ధి ఉంది. ప్రారంభించిన పనిలో ముందుచూపుతో వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. చక్కటి ఆలోచనా విధానంతో ముందుకు సాగి మంచిపేరు సంపాదిస్తారు. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

వృషభం

ఈ రాశివారికి ప్రారంభించబోయే పనిలో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

మిథునం

ఈ రాశివారు అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహారంలో పెద్దల సాయం అందుతుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

కర్కాటకం

ఈ రాశివారికి ఇది శుభకాలం. మంచి పనులు చేపడతారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. శ్రీమహాగణపతి ఆరాధన శుభప్రదం.

సింహం

ఈ రాశివారికి ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత ఇబ్బంది పడతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి.

కన్య

ఈ రాశివారు పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. దుర్గా అష్టోత్తరం చదివితే మంచిది.

తుల

ఈ రాశివారు శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

వృశ్చికం

ఈ రాశివారికి తమ తమ రంగాల్లో విజయసిద్ధి సాధిస్తారు. ఒక విషయంలో మనఃసంతోషాన్ని పొందుతారు. ఆర్థికపరంగా మేలు జరుగుతుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శుభప్రదం.

ధనుస్సు

ఈ రాశివారు తమ తమ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్తపడాలి. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శనిశ్లోకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి.

మకరం

ఈ రాశివారికి వారి నిజాయతీ వారిని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

కుంభం

ఈ రాశివారికి మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. వాతావరణం ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.

మీనం

ఈ రాశివారికి మిశ్రమ వాతావరణం కలదు. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.

Eha Tv

Eha Tv

Next Story