Today Rasi Phalalu : దిన ఫలాలు : ఈ రాశివారు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం!
ఈ రాశివారు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం!
24.10.2024,గురువారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం
తిథి:అష్టమి తె5.57 వరకు
వారం: బృహస్పతివాసరే
(గురువారం)
నక్షత్రం:పునర్వసు ఉ11.26 వరకు
యోగం:సిద్ధం తె11.37 వరకు
కరణం:బాలువ సా5.55 వరకు
తదుపరి కౌలువ తె5.57 వరకు
వర్జ్యం:రా7.40 - 9.18 వరకు
దుర్ముహూర్తము:ఉ9.49 - 10.35
మరల మ2.26 - 3.12
అమృతకాలం:ఉ9.00 - 10.37
మరల తె5.32నుండి
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:5.59
సూర్యాస్తమయం:5.31
మేషం
ఈ రాశివారు తమ తమ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. తోటివారి సూచనలు ఉపయోగపడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది. శివ ఆరాధన శుభప్రదం.
వృషభం
ఈ రాశివారికి ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.
మిథునం
ఈ రాశివారు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రారంభించబోయే పనుల్లో అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అభిప్రాయబేధాలు రాకుండా చూసుకోవాలి. మొహమాటంతో డబ్బులు ఖర్చు చేయకండి. బంధు,మిత్రులతో మాట పట్టింపులకు పోరాదు. చెడు సావాసాలు చేయకండి. విష్ణు నామాన్ని స్మరించాలి.
కర్కాటకం
ఈ రాశివారికి సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులను కోనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
సింహం
ఈ రాశివారికి ఇది మిశ్రమ కాలం. ముఖ్యమైన పనులను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. దుర్గాదేవిని, శ్రీవేంకటేశ్వరుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
కన్య
ఈ రాశివారికి ఇది మంచి కాలం. మీ పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సన్మానాలు అందుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. విష్ణు నామస్మరణ చేస్తే మంచిది.
తుల
ఈ రాశివారు ఉద్యోగంలో శ్రద్దగా పనిచేయాలి.బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీలక్ష్మి అష్టకాన్ని చదవాలి.
వృశ్చికం
ఈ రాశివారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా తోటివారి సహాయంతో వాటిని అధిగమిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
ధనుస్సు
ఈ రాశివారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
మకరం
ఈ రాశివారు అధికారులను ప్రసన్నం చేసుకునేలా ముందుకు సాగండి. సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.
కుంభం
ఈ రాశివారికి ప్రారంభించిన పనులలో విజయావకాశాలు ఉన్నాయి. ఆశించిన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో మీకు సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
మీనం
ఈ రాశివారికి ఇది ఉత్తమ కాలం. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. బుద్ధిబలంతో ఒక కీలక వ్యవహారం నుంచి బయటపడగలుగుతారు. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. శని ధ్యాన శ్లోకం చదివితే శుభప్రదం