Today Rasi Phalalu : దిన ఫలాలు : ఈ రాశివారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు!
Today Rasi Phalalu : దిన ఫలాలు : ఈ రాశివారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు!
22.10.2024, మంగళవారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం
తిథి:పంచమి ఉ7.28 వరకు
వారం: భౌమవాసరే
(మంగళవారం)
నక్షత్రం:మృగశిర ఉ11.30 వరకు
యోగం:పరిఘము మ2.59 వరకు
కరణం:తైతుల ఉ7.28 వరకు
తదుపరి గరజి సా6.57 వరకు
వర్జ్యం:రా7.49 - 9.24 వరకు
దుర్ముహూర్తము:ఉ8.16 - 9.03
మరల రా10.30 - 11.20
అమృతకాలం:రా1.21 - 2.56
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.57
సూర్యాస్తమయం:5.33
మేషం(Mesham)
ఈ రాశివారు వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తిచేస్తారు. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
వృషభం(Vrushabham)
ఈ రాశివారు ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలు రాబడతారు. తమ తమ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శ్రీఆంజనేయుని ఆరాధన శుభప్రదం.
మిథునం(Mithunam)
ఈ రాశివారికి ప్రారంభించిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం(Karkatakam)
ఈ రాశివారికి మిశ్రమ వాతావరణం ఉంది. బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనో ధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళనకు గురవుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
సింహం(Simham)
ఈ రాశివారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. శారీరక శ్రమ అధికం అవుతుంది. వాదులాటకు దూరంగా ఉండటమే మంచిది. శని శ్లోకాన్ని చదవండి.
కన్య(Kanya)
ఈ రాశివారు చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం.
తుల(Thula)
ఈ రాశివారికి అనుకున్న ఫలితాలు వెలువడుతాయి. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపతాపాలకు పోకండి. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. శివాష్టోత్తరం చదవాలి.
వృశ్చికం(Vruchikam)
ఈ రాశివారికి ఇది శుభకాలం. మీ మీ రంగాల్లో చక్కటి శుభఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మంచిది.
ధనుస్సు(Dhanusu)
ఈ రాశివారికి ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
మకరం(Makram)
ఈ రాశివారికి కర్మసిద్ధి ఉంది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.
కుంభం(Kumbam)
ఈ రాశివారు కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా చదవాలి.
మీనం(Meena)
ఈ రాశివారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. హనుమంతుడిని ఆరాధించాలి.
today-rasi-phalalu-astrology-and-horoscope-job-health-daily-life-predictons-of-22-october-2024