ఈ రాశి వారికి అప్రమత్తత అవసరం!

తేదీ:- 19, నవంబరు 2024

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- దక్షిణాయణం

ఋతువు:- శరదృతువు

మాసం:- కార్తీక మాసం

పక్షం:- బహుళ పక్షం

తిథి:- చవితి రా.9.06 వరకు

వారం:- మంగళవారం (భౌమ్యవాసరే)

నక్షత్రం:- ఆర్ద్ర రా.7.05 వరకు

యోగం:- సాధ్యం రా.7.25 వరకు

కరణం:- బవ ఉ.8.52 వరకు తదుపరి బాలువ రా.9.06 వరకు

వర్జ్యం:- లేదు

దుర్ముహూర్తము:- ఉ8.24 - 9.08 వరకు మరల రా.10.28 - 11.19 వరకు

అమృతకాలం:- ఉ.9.14 - 10.48 వరకు

రాహుకాలం:- మ3.00 - 4.30 వరకు

యమగండ/కేతుకాలం:- ఉ.9.00 - 10.30 వరకు

సూర్యరాశి:- వృశ్చికం

చంద్రరాశి:- మిథునం

సూర్యోదయం:- 6.09 సూర్యాస్తమయం:- 5.21

మేషం(Mesham)

ఈ రాశి వారికి రుణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. వినాయకుడి పూజ చేయండి.

వృషభం(Vrushabam)

ఈ రాశి వారికి రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. అమ్మవారిని ఆరాధించండి.

మిథునం(Mithunam)

ఈ రాశి వారు పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. దుర్గా దేవి స్తోత్రం పఠించండి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశి వారు ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం సందర్శించండి.

సింహం(simham)

ఈ రాశి వారికి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతనకార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. నవగ్రహ స్తోత్రం చదవండి.

కన్య(Kanya)

ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి. శివారాధన శ్రేయస్కరం.

తుల(Thula)

ఈ రాశి వారికి ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశి వారు నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇష్ట దైవాన్ని ప్రార్ధించండి.

ధనుస్సు(Dhanussu)

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనంవహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. మహాలక్ష్మి పూజ చేయండి.

మకరం(Makaram)

ఈ రాశి వారికి కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణము మంచిది.

కుంభం(Kumbam)

ఈ రాశి వారు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు. గణపతి ఆరాధన మంచిది.

మీనం(Meenam)

ఈ రాశి వారికి అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. కుల దైవాన్ని ప్రార్ధించండి. మంచి జరుగుతుంది.

Eha Tv

Eha Tv

Next Story