ఈ రాశివారు సంతోషకరమైన వార్త వింటారు!

గురువారం,అక్టోబర్17,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం

తిథి:పూర్ణిమ సా5.17 వరకు

వారo:గురువారం(బృహస్పతివాసరే)

నక్షత్రం:రేవతి సా5.34 వరకు

యోగం:వ్యాఘాతం ఉ7.19 వరకు

తదుపరి హర్షణం తె4.19 వరకు

కరణం:విష్ఠి ఉ6.31 వరకు

తదుపరి బవ సా5.17 వరకు

ఆ తదుపరి బాలువ తె4.09 వరకు

వర్జ్యం:ఉ6.26 - 7.55

దుర్ముహూర్తము:ఉ9.48 - 10.35

మరల మ2.28 - 3.15

అమృతకాలం:మ3.50 - 4.49

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30

సూర్యరాశి:కన్య

చంద్రరాశి:మీనం

సూర్యోదయం:5.56

సూర్యాస్తమయం:5.36

తులా సంక్రమణం రా9.26లకు

మేషం

ఈ రాశివారికి వారిలోని శ్రద్ధాభక్తులు వారిని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరినీ నమ్మకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

వృషభం

ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధు,మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

మిథునం

ఈ రాశివారికి బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్నిపెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమ్తతంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ శుభప్రదం.

కర్కాటకం

ఈ రాశివారికి ధర్మసిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

సింహం

ఈ రాశివారికి సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రీరామ నామ జపం శ్రేయోదాయకం.

కన్య

ఈ రాశివారు చిత్తశుద్ధితో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా కానీయకండి. ఆదిత్య హృదయం చదువుకోవాలి.

తుల

ఈ రాశివారు మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. శ్రీగణపతి ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం

ఈ రాశివారు తమ తమ రంగాల్లో ఎంతో శ్రద్ధతో పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. శారీరకశ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. దుర్గ నామస్మరణ శుభప్రదం.

ధనుస్సు

ఈ రాశివారు సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.

మకరం

ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి. మీ పై అధికారుల వద్ధ అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది. శివస్తోత్రం చదవడం మంచిది.

కుంభం

ఈ రాశివారికి సమాజంలో వారి కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్ర నామ పారాయణ చేస్తే బాగుంటుంది.

మీనం

ఈ రాశివారికి ముఖ్యమైన వ్యవహారాలలో అనుకున్నది దక్కుతుంది. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి సహాయసహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గాస్తోత్రం చదవాలి.

Eha Tv

Eha Tv

Next Story