ఈ రాశివారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు.
16.10.2024,బుధవారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం
తిథి:చతుర్దశి రా7.45 వరకు
వారం:సౌమ్యవాసరే
(బుధవారం)
నక్షత్రం:ఉత్తరాభాద్ర రా7.18 వరకు
యోగం:ధృవం ఉ10.36 వరకు
కరణం:గరజి ఉ8.57 వరకు
తదుపరి వణిజ రా7.45 వరకు
వర్జ్యం:ఉ.శే.వ.7.23 వరకు
దుర్ముహూర్తము:ఉ11.22 - 12.09
అమృతకాలం:మ2.50 - 4.20
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:5.56
సూర్యాస్తమయం: 5.36
మేషం
ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనఃశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్యహృదయం చదవడం మంచిది.
వృషభం
ఈ రాశివారికి వారిలోని శ్రద్ధాభక్తులు వారిని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అతిగా ఎవరినీ విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
మిథునం
ఈ రాశివారికి కీలక వ్యవహారాలలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రీసుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
కర్కాటకం
ఈ రాశివారికి సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.
సింహం
ఈ రాశివారు దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖసౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్య విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శని ధ్యానం శుభదాయకం.
కన్య
ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారు ఉన్నారు జాగ్రత్త. దుర్గానామాన్ని జపించాలి.
తుల
ఈ రాశివారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.ఇష్టదైవాన్ని స్మరించండి.
వృశ్చికం
ఈ రాశివారికి వారి స్వధర్మం వారిని కాపాడుతుంది. ఒక సమస్య మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
ధనుస్సు
ఈ రాశివారికి బుద్దిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమ్తతంగా ఉండాలి. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ చేయడం మంచిది.
మకరం
ఈ రాశివారు చంచల స్వభావాన్ని దరిచేరనీయకండి. కష్టాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. శ్రీరామ నామాన్ని జపించడం శుభప్రదం.
కుంభం
ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ దర్శనం శుభకరం.
మీనం
ఈ రాశివారికి ఇది శుభకాలం. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన శుభకరం.