Today rasi Phalalu : దిన ఫలాలు : ఈ రాశివారికి ఇది శుభసమయం!
ఈ రాశివారికి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
తేదీ:- 15, అక్టోబర్ 2024
సంవత్సరం:- శ్రీ క్రోధి నామ
అయనం:- దక్షిణాయణం
ఋతువు:- శరదృతువు
మాసం:- ఆశ్వయుజ
పక్షం:- శుక్ల పక్షం
తిథి:- త్రయోదశి రా.10.01వరకు
వారం:- మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం:- పూర్వాభాద్ర రా.8.49 వరకు
యోగం:- వృద్ధి మ1.39 వరకు
కరణం:- కౌలువ ఉ.11.16 వరకు తదుపరి తైతుల రా.10.09 వరకు
వర్జ్యం:- ఉ.శే.వ.5.58 వరకు మరల తె.5.54 నుండి
దుర్ముహూర్తము:- ఉ.8.27 - 9.14 వరకు మరల రా.10.45 - 11.34
అమృతకాలం:- మ.1.27 - 2.57 వరకు
రాహుకాలం:- మ3..00 - 4.30 వరకు
యమగండ/కేతుకాలం:- ఉ.9.00 - 10.30 వరకు
సూర్యరాశి:- కన్య
చంద్రరాశి:- కుంభం
సూర్యోదయం:- 5.56
సూర్యాస్తమయం:- 5.37
మేషం
ఈ రాశివారికి వారి పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవత స్మరణ శుభప్రదం.
వృషభం
ఈ రాశివారికి ఇది శుభసమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
మిథునం
ఈ రాశివారు తమ తమ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.
కర్కాటకం
ఈ రాశివారికి వారి మనోధైర్యమే వారిని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు వారిని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
సింహం
ఈ రాశివారికి ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్ధికంగా శుభఫలితాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.
కన్య
ఈ రాశివారికి తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. దుర్గాదేవిని ఆరాధించడం వల్ల బాగుంటుంది.
తుల
ఈ రాశివారికి శ్రమ ఫలిస్తుంది. స్థిరనిర్ణయాలు మేలు చేస్తాయి. కలహాలు సూచితం. తోటివారిని కలుపుకొనిపోవడం ఉత్తమం. గణేశ అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి.
వృశ్చికం
ఈ రాశివారికి ఒక శుభవార్త వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధు,మిత్రులను ఆదరిస్తారు. కానీ,వాళ్లు మిమ్మల్ని నమ్మంచి మోసం చేసే అవకాశం ఉంది. అనవసర అంశాల గురించి ఎక్కువ సమయాన్ని కేటాయించకండి. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. శ్రీలక్ష్మీ అష్టోత్తరం పఠనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
ధనుస్సు
ఈ రాశివారు ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది.
మకరం
ఈ రాశివారికి కార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం కలదు. బుద్ధిబలంతో తోటివారి మనస్సును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.
కుంభం
ఈ రాశివారికి ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభకరం.
మీనం
ఈ రాశివారు అభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.