ఈ రాశి వారికి ధన లాభం ఉంది!

తేదీ:- 17, నవంబరు 2024

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- దక్షిణాయణం

ఋతువు:- శరదృతువు

మాసం:- కార్తీక మాసం

పక్షం:- బహుళ పక్షం

తిథి:- విదియ రా.11.26 వరకు

వారం:- ఆదివారం (భానువాసరే)

నక్షత్రం:- రోహిణి రా.8.12 వరకు

యోగం:- శివం రా.11.53 వరకు

కరణం:- తైతుల మ.12.18 వరకు తదుపరి గరజి రా.11.26 వరకు

వర్జ్యం:- మ.12.34 - 2.05

మరల రా.1.37 - 3.10 వరకు

దుర్ముహూర్తము:- మ.3.51 - 4.36 వరకు

అమృతకాలం:- సా.5.09 - 6.40 వరకు

రాహుకాలం:- సా.4.30 - 6.00 వరకు

యమగండ/కేతుకాలం:- మ.12.00 - 1.30 వరకు

సూర్యరాశి:- వృశ్చికం

చంద్రరాశి:- వృషభం

సూర్యోదయం:- 6.09

సూర్యాస్తమయం:- 5.21

మేషం(Mesham)

ఈ రాశి వారికి అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. సూర్యనారాయణ స్వామి దేవాలయం సందర్శించండి.

వృషభం(Vrushabam)

ఈ రాశి వారికి మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. దుర్గా దేవి స్తోత్రం పఠించండి.

మిథునం(Mithunam)

ఈ రాశి వారు నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి.

కర్కాటకం(Karkatakam)

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తపడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. అమ్మవారిని ఆరాధించండి.

సింహం(Simham)

ఈ రాశి వారికి కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయసహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. శివారాధన శ్రేయస్కరం.

కన్య(Kanya)

ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. నవగ్రహ స్తోత్రం చదవండి.

తుల(Thula)

ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.

వృశ్చికం(Vruchikam)

ఈ రాశి వారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఇష్ట దైవాన్ని ప్రార్ధించండి.

ధనుస్సు(Dhanusu)

ఈ రాశి వారు మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణము చేయండి.

మకరం(Makaram)

ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. మహాలక్ష్మిని పూజించండి.

కుంభం(Kumbham)

ఈ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. శివాలయ సందర్శన శుభం.

మీనం(Meenam)

ఈ రాశి వారు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురువతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. శివపార్వతులను భక్తితో పూజించండి.

Eha Tv

Eha Tv

Next Story