ఈ రాశివారు నూతన వస్తువులను కొంటారు!

తేదీ:- 14, అక్టోబర్ 2024

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- దక్షిణాయణం

ఋతువు:- శరదృతువు

మాసం:- ఆశ్వయుజ

పక్షం:- శుక్ల పక్షం

తిథి:- ద్వాదశి రా.12.10 వరకు (గోద్వాదశి)

వారం:- సోమవారం‌ (ఇందువాసరే)

నక్షత్రం:- శతభిషం రా.10.27 వరకు

యోగం:- గండ సా.4.34 వరకు

కరణం:- బవ మ.1.25 వరకు తదుపరి బాలువ రా.12.23 వరకు

వర్జ్యం:- ఉ.6.34 - 8.05

మరల తె.4.28నుండి

దుర్ముహూర్తము:- మ.12.10 - 12.57

మరల మ.2.30 - 3.17

అమృతకాలం:- మ.3.39 - 5.10 వరకు

రాహుకాలం:- ఉ.7.30 - 9.00 వరకు

యమగండ/కేతుకాలం:- ఉ.10.30 - 12.00 వరకు

సూర్యరాశి:- కన్య

చంద్రరాశి:- కుంభం

సూర్యోదయం:- 5.56

సూర్యాస్తమయం:- 5.37

మేషం

ఈ రాశివారు స్థిర నిర్ణయాలతో మంచిని సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణసౌఖ్యం ఉంది. పంచముఖ ఆంజనేయ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది.

వృషభం

ఈ రాశివారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలాలు ఉంటాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అస్థిరనిర్ణయాలవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. విష్ణు సహస్రనామం చదివితే ఇంకా బాగుంటుంది.

మిథునం

ఈ రాశివారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు అనుకూలిస్తాయి. స్థిరమైన ఆలోచనలు మేలు చేస్తాయి. గణపతి అష్టోత్తరం పఠిస్తే బాగుంటుంది.

కర్కాటకం

ఈ రాశివారికి వారి ధర్మం వారిని ఉన్నతుల్ని చేస్తుంది. బంధువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్థిరమైన ఆలోచనా విధానంతో ముందుకు సాగి సత్ఫలాలను పొందుతారు. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.

సింహం

ఈ రాశివారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. తమ తమ రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. సూర్య ఆరాధన చేస్తే మంచిది.

కన్య

ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలున్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. చిత్తసౌఖ్యం ఉంది. మనోధైర్యం సదా కాపాడుతుంది. ప్రసన్నాంజనేయ సోత్ర పారాయణ చేయాలి.

తుల

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టే పనుల్లో అనుకున్నదానికంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శ్రీహరినీ ఆరాధిస్తే మంచిది.

వృశ్చికం

ఈ రాశివారు ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు

ఈ రాశివారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. దైవారాధన మానవద్దు.

మకరం

ఈ రాశివారి పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

కుంభం

ఈ రాశివారు మొదలుపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. చంచలబుద్ధి ఇబ్బందినిస్తుంది. దుర్జనసాంగత్యంవల్ల సమస్యలు పెరుగుతాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

మీనం

ఈ రాశివారికి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూలఫలితాలున్నాయి. చిత్తసౌఖ్యం ఉంది. ఇష్టదైవ స్తుతి శుభప్రదం.

Eha Tv

Eha Tv

Next Story