ఈ రాశివారు మనోధైర్యంతో ముందుకు సాగాలి!

తేదీ:- 13, అక్టోబర్ 2024.

సంవత్సరం:- శ్రీక్రోధినామ

అయనం:- దక్షిణాయణం

ఋతువు:- శరదృతువు

మాసం:- ఆశ్వయుజ

పక్షం:- శుక్ల పక్షం

తిథి:- ఏకాదశి రా.2.20 వరకు

వారం:- ఆదివారం (భానువాసరే)

నక్షత్రం:- ధనిష్ఠ రా.11.38 వరకు

యోగం:- శూలం రా.7.18 వరకు

కరణం:- వణిజ మ.3.18 వరకు తదుపరి భద్ర రా.2.25 వరకు

వర్జ్యం:- ఉ.శే.వ.6.07 వరకు

దుర్ముహూర్తము:- సా.4.04 - 4.51 వరకు

అమృతకాలం:- మ.1.47 - 3.19 వరకు

రాహుకాలం:- ఉ.9.00 - 10.30 వరకు

యమగండ/కేతుకాలం:- మ.1.30 - 3.00 వరకు

సూర్యరాశి:- కన్య

చంద్రరాశి:- కుంభం

సూర్యోదయం:- 5.55 సూర్యాస్తమయం:- 5.39

సర్వేషాం ఏకాదశి

మేషం

ఈ రాశివారికి శుభఫలితాలు కొనసాగుతున్నాయి. ఏ పని ప్రారంభించినా కలిసివస్తుంది. వృత్తి,వ్యాపారాలలో అనుకూల ఫలితాలు వస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు గొప్ప లాభాన్ని ఇస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనం వృద్ధి చెందుతుంది. ఇష్టదేవతా ధ్యానం శక్తిని ఇస్తుంది.

వృషభం

ఈ రాశివారికి తమ తమ రంగాల్లో వారి శ్రమ ఫలిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అనవసర ఖర్చులకు అడ్డుకట్టవేయాలి. మానసిక సంతృప్తి ఉంటుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదం.

మిథునం

ఈ రాశివారికి ప్రారంభించబోయే పనుల్లో ఓర్పు,సహనం,పట్టుదల అవసరం. ఉద్యోగంలో ఆచితూచి ముందుకు సాగాలి. పెద్దల నుంచి వచ్చిన సంపదను కాపాడుకోవాలి. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వరారాధన శుభప్రదం.

కర్కాటకం

ఈ రాశివారు ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. నిర్ణీత సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.

సింహం

ఈ రాశివారు సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది. శ్రీలలితా దేవి నామస్మరణ శుభప్రదం.

కన్య

ఈ రాశివారు మనస్తాపం చెందకుండా మనోధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. ఆత్మీయులతో ఆచితూచి వ్యవహరించాలి. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.

తుల

ఈ రాశివారు ప్రారంభించబోయే పనుల్లో తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల శీఘ్ర ఫలితాలు సొంతం అవుతాయి. ఉత్సాహంతో ముందుకు సాగి విజయవంతమైన ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవ శ్లోకాలు చదివితే మంచిది.

వృశ్చికం

ఈ రాశివారు పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. అలసట పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.

ధనుస్సు

ఈ రాశివారు ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తారు. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రీరామ నామాన్నిజపిస్తే మంచిది.

మకరం

ఈ రాశివారికి ఇది శుభకాలం. ఏ పనిని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బంధు,మిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఉల్లాసభరితమైన వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం.

కుంభం

ఈ రాశివారు వృత్తి,ఉద్యోగాల్లో తోటివారి ప్రోత్సాహంతో అనుకున్నది సాధిస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదలతో ముందుకు సాగుతారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

మీనం

ఈ రాశివారికి ఇది మిశ్రమకాలం. మీ మీ రంగాల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శనిధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.

Eha Tv

Eha Tv

Next Story