ఈ రాశి వారికి అనుకూలమైన రోజు ఇది!

తేదీ:- 13, నవంబరు 2024

సంవత్సరం:- శ్రీ క్రోధినామ

అయనం:- దక్షిణాయనం పక్షం:- శరదృతువు

మాసం:- కార్తీక మాసం

పక్షం:- శుక్ల పక్షo

తిథి:- ద్వాదశి ఉ.10:02

వారం: బుధవారం (సౌమ్యవాసరం)

నక్షత్రం:- రేవతి రా.1:44

యోగం:- వజ్రం ప.2:25

తదుపరి సిద్ధి

కరణం:- బాలువ ఉ.10:02 తదుపరి కౌలవ రా.8:47

వర్జం:- ప.2:35 - 4:04 వరకు

అమృతకాలం:- రా.11:30 - 1:00 వరకు

*దుర్ముహుర్తం:- ప.11:21 - 12:06 వరకు

శుభసమయాలు:- సా.4:00 - 5:00 వరకు

అభజిత్ లగ్నం:- లేదు

బ్రహ్మముహూర్తం: ఉ.4:31 - 5:19 వరకు

రాహుకాలం:- మ.12:00 - 1:30 వరకు

యమగండం:- ఉ.7:30 - 9:00 వరకు

గుళికకాలం:- ఉ.10:30 - 12:00‌ వరకు

సూర్యరాశి:- తుల

చంద్రరాశి:- మీనం

సూర్యోదయం:- 6:07

సూర్యాస్తమయం:-5:21

మేషం

ఈ రాశివారికి ఆక‌స్మిక ధ‌న‌లాభ‌ముంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజ‌యాల‌ను సాధిస్తారు. నూత‌న కార్యాల‌ను ప్రారంభిస్తారు. రుణ‌విముక్తి ల‌భిస్తుంది. మాన‌సికానందం పొందుతారు. మహాలక్ష్మిని పూజించండి. అంతా మంచే జరుగుతుంది.

వృషభం

ఈ రాశివారికి స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రింప‌బ‌డుతాయి. నూత‌న గృహ‌కార్యాల‌పై శ్ర‌ద్ధ వ‌హిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ ద‌ర్శ‌నం చేసుకుంటారు. భ‌క్తి శ్ర‌ద్ధ‌లు అధిక‌మ‌వుతాయి. శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించడం శ్రేయస్కరం.

మిథునం

ఈ రాశివారికి శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. దూర బంధువుల‌తో క‌లుస్తారు. త‌ద్వారా లాభాలుంటాయి. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు సంపూర్ణంగా నెర‌వేర్చుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగ‌ముంటుంది. అన్ని విష‌యాల్లో విజ‌యాన్ని సాధిస్తారు. దుర్గాదేవి అష్టోత్తరాన్ని పఠించండి.

క‌ర్కాట‌కం

ఈ రాశివారికి బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మానసికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట మంచిది. అన‌వ‌స‌ర భ‌యం ఆవ‌హిస్తుంది. హనుమాన్‌ చాలీసా పారాయణము చేయండి.

సింహం

ఈ రాశివారికి ఇది అనుకూలమైన రోజు. గ‌తంలో వాయిదా వేయ‌బ‌డిన ప‌నులు పూర్త‌వుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. కొన్ని జ‌ఠిల‌మైన స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి.

క‌న్య

ఈ రాశివారికి రుణ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లేర్ప‌డే అవ‌కాశం ఉంది. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. నవగ్రహ ప్రదక్షణ చేయండి.. శుభం చేకూరుతుంది.

తుల

ఈ రాశివారు అనారోగ్య బాధ‌ల‌తో సత‌మ‌త‌మ‌వుతారు. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లుంటాయి. నూత‌న వ్య‌క్తులు క‌లుస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మానసికాందోళ‌న చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూర‌మ‌వుతాయి. అమ్మవారిని ఆరాధించండి.

వృశ్చికం

ఈ రాశివారికి విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భ‌మ‌వుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌రాదు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశం ఉంది. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. వృత్తి, ఉద్యోగ‌రంగంలోని వారికి ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గూర్చి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం. శివాలయ సందర్శన మంచిది.

ధ‌నుస్సు

ఈ రాశివారు శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంలో ఆనందంగా ఉంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో స‌ఫ‌లీకృతుల‌వుతారు. కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు అధిక‌మ‌వుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి..

మ‌క‌రం

ఈ రాశివారికి ఆక‌స్మిక ధ‌న న‌ష్టం క‌లిగే అవ‌కాశ‌ముంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్ర‌త్త అవ‌స‌రం. ప‌క్క‌దోవ ప‌ట్టించేవారి మాట‌లు విన‌రాదు. క్రీడాకారుల‌కు, రాజ‌కీయ రంగాల్లోని వారికి మాన‌సికాందోళ‌న త‌ప్ప‌దు. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది. భగవన్నామ స్మరణ మరువకండి.

కుంభం

ఈ రాశివారికి రుణ‌ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫ‌లిస్తాయి. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లుంటాయి. శుభకార్యాల మూల‌కంగా ధ‌న‌వ్య‌యం అధిక‌మ‌వుతుంది. ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. అనారోగ్య‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం. మహావిష్ణువును పూజించండి.. మేలు జరుగుతుంది.

మీనం

ఈ రాశివారు స్థిరాస్తుల విష‌యంలో జాగ్ర‌త్తగా ఉండుట మంచిది. ఒక అద్భుత అవ‌కాశాన్ని కోల్పోతారు. నూత‌న వ్య‌క్తుల ప‌రిచ‌య‌మేర్ప‌డుతుంది. ప్ర‌యాణాల వ‌ల్ల లాభాన్ని పొందుతారు. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోక త‌ప్ప‌దు. ఆది దంపతులైన శివపార్వతులను భక్తితో కొలవండి.

Updated On 13 Nov 2024 2:45 AM GMT
Eha Tv

Eha Tv

Next Story