ఈ రాశివారికి శుభఫలితాలు!

తేదీ:- 11, అక్టోబర్, 2024

సంవత్సరం:- శ్రీ క్రోధి నామ

అయనం:- దక్షిణాయణం ఋతువు:- శరదృతువు

మాసం:- ఆశ్వయుజ

పక్షం:- శుక్ల పక్షం

తిథి:- అష్టమి ఉ.6.30 వరకు తదుపరి నవమి తె.5.37 వరకు

వారం:- శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం:- ఉత్తరాషాఢ రా.1.21 వరకు

యోగం:- సుకర్మ రా.11.58 వరకు

కరణం:- బవ ఉ.6.45 వరకు తదుపరి బాలువ రా.6.11 వరకు ఆ తదుపరి కౌలువ తె.5.37 వరకు

వర్జ్యం:- ఉ.9.35 - 11.10 మరల తె.5.18 నుండి

దుర్ముహూర్తము:- ఉ.8.15 - 9.02 మరల మ12.10 - 12.57

అమృతకాలం:- రా.7.05 - 8.40

రాహుకాలం:- ఉ.10.30 - 12.00

యమగండ/కేతుకాలం:- మ.3.00 - 4.30

సూర్యరాశి:- కన్య

చంద్రరాశి:- మకరం

సూర్యోదయం:- 5.55 సూర్యాస్తమయం:- 5.39

మేషం

ఈ రాశివారికి తమ తమ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థికఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. కృత్తికా నక్షత్ర(విపత్) వారు నూతన పనులు ప్రారంభించకుండా ఉండటం మేలు. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

వృషభం

ఈ రాశివారికి వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మంచి ఆలోచనలు శక్తిని ఇస్తాయి. తోటివారితో సౌమ్యంగా వ్యవహరించండి, మేలు జరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. సూర్యధ్యానం శక్తిని ఇస్తుంది.

మిథునం

ఈ రాశివారు కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. పంచమంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రధ్యానం శుభకరం.

కర్కాటకం

ఈ రాశివారు తమ తమ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. శత్రునాశనం ఉంది. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం.

సింహం

ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

కన్య

ఈ రాశివారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. ఒకటీరెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త . ఈశ్వర ధ్యానం శుభప్రదం.

తుల

ఈ రాశివారికి ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

వృశ్చికం

ఈ రాశివారికి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుని గొప్ప ఫలితాలను పొందుతారు. గురుచరిత్ర చదవడం మంచిది.

ధనుస్సు

ఈ రాశివారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పనిని ప్రారంభించినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. జన్మస్థ చంద్రబలం అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్థన మరింత మేలు చేస్తుంది.

మకరం

ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించబోయే ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. దత్తాత్రేయ స్వామి సందర్శనం శుభప్రదం.

కుంభం

మంచి ఫలితాలు పొందుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర, ధాన్య లాభాలు ఉన్నాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.

మీనం

ఈ రాశివారు ప్రారంభించిన పనిలో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా ముందుకు సాగాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి.కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కలహ సూచన ఉంది. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

Eha Tv

Eha Tv

Next Story