ఈ రాశి వారికి సుఖ శాంతులు ఉన్నాయి!
తేదీ:- 10, నవంబరు 2024
సంవత్సరం:- శ్రీ క్రోధి నామ అయనం:- దక్షిణాయనం ఋతువు:- శరదృతువు
మాసం:- కార్తీక మాసం
పక్షం:- శుక్ల పక్షo
తిథి:- నవమి సా.4:36
నక్షత్రం:- ధనిష్ఠ ఉ.7:47 తదుపరి శతభిషం
యోగం:- ధ్రువం రా.11:28
కరణం:- కౌలవ సా.4:36 తదుపరి తైతుల తె.3:33 వరకు
వర్జం:- ప.2:36 - 4:07 వరకు
అమృతకాలం:- రా.11:43 - 1:14 వరకు
దుర్ముహుర్తం:- సా.3:52 - 4:37 వరకు
శుభసమయాలు:- ఉ.7:00 - 9:00 వరకు
అభిజిత్ ముహూర్తం:- ఉ.11:48 - 12:32 వరకు
బ్రహ్మముహూర్తం:- ఉ.4:29 - 5:17 వరకు
రాహుకాలం:- సా.4:30 - 6:00 వరకు
యమగండం:- మ.12:00 - 1:30 వరకు
గుళికకాలం:- మ.3:00 - 4:30 వరకు
సూర్యరాశి:- తుల
చంద్రరాశి:- కుంభం
సూర్యోదయం:- 6:05
సూర్యాస్తమయం:- 5:23
మేషం
ఈ రాశి వారికి మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. శివారాధన చేస్తే శుభం కలుగుతుంది.
వృషభం
ఈ రాశి వారు ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. నవగ్రహ ప్రదక్షణ చేయండి.
మిథునం
ఈ రాశివారు చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది. వ్యవసాయరంగంలోనివారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. అమ్మవారి ఆరాధన మంచిది.
కర్కాటకం
ఈ రాశి వారికి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. దైవారాధన మంచిది .
సింహం
ఈ రాశి వారు సంతోషంగా కాలం గడుపుతారు. శుభార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. దుర్గా దేవి అష్టోత్తరం చదవండి.
కన్య
ఈ రాశి వారు వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. హనుమాన్ చాలీసా చదవండి.
తుల
ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది. శ్రీ వేంకటేశ్వర ఆలయ సందర్శన మంచిది.
వృశ్చికం
ఈ రాశివారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని భక్తిగా ప్రార్ధించండి.
ధనుస్సు
ఈ రాశి వారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. మహాలక్ష్మి పూజ శ్రేయస్కరం.
మకరం
ఈ రాశి వారికి కుటుంబంలో సుఖ,సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. రామాలయ సందర్శన శుభం
కుంభం
ఈ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.
మీనం
ఈ రాశి వారికి అకాల భోజనాదులవల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభిచకూడదు. వినాయక ఆరాధన మంచిది.