ఈ రాశివారికి గ్రహబలం అనుకూలిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్నది సాధిస్తారు.

పంచాంగము 🌓 10.10.2024

శ్రీ యజ్ఞాపద్మనాభాయనమః

కలియుగం: 5126

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: శరద్

మాసం: ఆశ్వీయుజ

పక్షం: శుక్ల - శుద్ధ

తిథి: సప్తమి ఉ‌.07:37 వరకు

తదుపరి అష్టమి

వారం: గురువారం - బృహస్పతి

వాసరే

నక్షత్రం: పూర్వాషాఢ రా.02:09 వరకు

తదుపరి ఉత్తరాషాఢ

యోగం: అతిగండ రా.01:27 వరకు

తదుపరి సుకర్మ

కరణం: వణిజ ఉ‌.07:37 వరకు

తదుపరి భధ్ర రా.07:20 వరకు

తదుపరి బవ

వర్జ్యం: ఉ‌.11:35 - 01:12 వరకు

దుర్ముహూర్తం: ఉ‌.10:05 - 10:53

మరియు ప‌.02:48 - 03:35

రాహు కాలం: ప‌.01:31 - 03:00

గుళిక కాలం: ఉ‌.09:05 - 10:34

యమ గండం: ఉ‌.06:08 - 07:36

అభిజిత్: 11:39 - 12:25

సూర్యోదయం: 06:07

సూర్యాస్తమయం: 05:57

చంద్రోదయం: ప‌.12:30

చంద్రాస్తమయం: రా.11:37

సూర్య సంచార రాశి: కన్య

చంద్ర సంచార రాశి: ధనుస్సు

దిశ శూల: దక్షిణం

శ్రీ కాళికాష్టమి

చిత్ర కార్తె

శ్రీ దుర్గా - సరస్వతి పూజ

సద్దుల‌ బతుకమ్మ

మేషం

ఈ రాశివారికి గ్రహబలం అనుకూలిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థికలావాదేవీలు లాభాన్ని చేకూరుస్తాయి. సమాజంలో మంచిపేరు దక్కుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఇష్టదైవాన్ని స్మరించండి.

వృషభం

ఈ రాశివారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. కొన్ని సందర్భాల్లో పక్క వారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. పెద్దల మనోభావాలకు తగినట్టుగా ప్రవర్తించడం మేలైన ఫలితాన్ని ఇస్తుంది. గ్రహబలం తక్కువగా ఉంది కాబట్టి, నవగ్రహ ధ్యానం, నవగ్రహాల దర్శనం మేలు చేస్తుంది.

మిథునం

ఈ రాశివారికి ఉద్యోగంలో శ్రమ పెరిగినప్పటికీ మనోభీష్టం నెరవేరుతుంది. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు మంచి ఫలితాలను తెచ్చి పెడుతుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మానసికంగా ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. చతుర్థంలో చంద్రుడు ఉన్నాడు. దుర్గాధ్యానం శుభప్రదం.

కర్కాటకం

ఈ రాశివారికి గ్రహబలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రారంభించిన పనుల్లో పురోగతి ఉంటుంది. బంధు,మిత్రులు ఆదరిస్తారు. ఒక ముఖ్యమైన ఆలోచనను ఆచరణలో పెడతారు. తద్వారా ఆదాయమార్గాలు పెరుగుతాయి. ఇష్టదైవ నామాన్ని స్మరించండి. మేలు చేకూరుతుంది.

సింహం

ఈ రాశివారు మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో పనులను వాయిదా వేయవద్దు. కీలక వ్యవహారాలలో మీరు ఆశించిన సహాయం అందుతుంది. ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. చంద్రశేఖరాష్టకం చదవండి, మంచి జరుగుతుంది.

కన్య

ఈ రాశివారు కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఉద్యోగంలో చిత్తశుద్ధి అవసరం. ఆర్థికఫలితాలు అనుకూలంగా ఉంటాయి. తోటివారిని కలుపుకొనిపోతే మేలు జరుగుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. సూర్యధ్యాన శ్లోకాలు చదివితే మంచిది.

తుల

ఈ రాశివారికి ఓ సూచన. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. బాగా కష్టపడితే తప్ప పనులు పూర్తవ్వవు. స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సత్తువ ఉన్న భోజనాన్ని తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇస్తూ ముందుకెళ్లండి, మంచి జరుగుతుంది. శ్రీఆంజనేయ సందర్శనం శుభప్రదం.

వృశ్చికం

ఈ రాశివారికి మంచి ఫలితాలు సాధించడానికి ఇది సరైన సమయం. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగండి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల పనులు తొందరగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శ్రీగణపతి ఆరాధన శుభప్రదం.

ధనుస్సు

ఈ రాశివారికి ఇది చక్కటి శుభకాలం. ప్రారంభించబోయే పనులు గొప్ప ఫలితాలను ఇస్తాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థిక యోగం శుభప్రదం. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభదాయకం.

మకరం

ఈ రాశివారు లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మ సందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి.మనో విచారం కలుగకుండా చూసుకోవాలి. శివారాధన శుభప్రదం.

కుంభం

ప్రారంభించబోయే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శుభఫలితాలు పొందడానికి శ్రీవేంకటేశ్వర స్వామిని సందర్శించడం వల్ల శుభఫలితాలు పొందుతారు.

మీనం

ఈ రాశివారు అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోవద్దు. శనిశ్లోకం చదువుకోవాలి. శ్రీఆంజనేయ సందర్శనం శుభప్రదం.

ehatv

ehatv

Next Story