Today Rasi Phalalu : దిన ఫలాలు : ఈ రాశివారికి శుభఫలితాలున్నాయి!
ఈ రాశివారికి శుభఫలితాలున్నాయి!
తేదీ: 9, అక్టోబర్ 2024
సంవత్సరం: శ్రీ క్రోధి నామ
అయనం: దక్షిణాయణం ఋతువు: శరదృతువు
మాసం: ఆశ్వయుజ
పక్షం: శుక్ల పక్షము
తిథి: షష్ఠి ఉ.7.06 వరకు
వారం: బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం: మూల రా1.24వరకు
యోగం: శోభన తె3.23 వరకు
కరణం: తైతుల ఉ7.24 వరకు తదుపరి గరజి రా7.21 వరకు
వర్జ్యం: ఉ9.02 - 10.41
మరల రా11.50 - 1.29
దుర్ముహూర్తము:ఉ11.24 - 12.11
అమృతకాలం: సా.6.54 - 8.33
రాహుకాలం: మ.12.00 - 1.30
యమగండ/కేతుకాలం: ఉ.7.30 - 9.00
సూర్యరాశి: కన్య
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం: 5.55 సూర్యాస్తమయం: 5.41
మేషం(Mesha)
ఈ రాశివారికి శుభ ఫలితాలు వెలువడతాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది.
వృషభం(Vrushabha)
ఈ రాశివారు చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో మాత్రం అంటీముట్టనట్టు ఉండటమే మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.
మిథునం(Mithunam)
ఈ రాశివారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం పఠిస్తే మంచిది.
కర్కాటకం(Karkatam)
ఈ రాశివారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆద్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు.
సింహం(Simha)
ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారాలలో ముందుచూపు అవసరం. దైవ బలం రక్షిస్తోంది. విష్ణు సందర్శనం శుభప్రదం.
కన్య(Kanya)
ఈ రాశివారికి బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ ధ్యానం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.
తుల(Thula)
ఈ రాశివారు మొదలుపెట్టిన కార్యాలు ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. సూర్యారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
వృశ్చికం(Vruchikam)
ఈ రాశివారు శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.
ధనుస్సు(Dhanusu)
ఈ రాశివారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలూ పొందుతారు. విందూ వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన శుభప్రదం.
మకరం(Makaram)
ఈ రాశివారు శ్రమపెరగకుండా చూసుకోవాలి. కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చును. వృథా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి.
కుంభం(Kumbham)
ఈ రాశివారికి ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. దుర్గా స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.
మీనం(Meena)
ఈ రాశివారికి శుభ ఫలితాలు కలవు. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం. ఇష్టదేవతను ఆరాధిస్తే మంచిది.