ఈ రాశివారికి అప్రమత్తత అవసరం...!

తేదీ: 08, అక్టోబర్, 2024

వారం: మంగళవారం

సంవత్సరం: శ్రీ క్రోధి నామ

అయనం: దక్షిణాయనం ఋతువు: శరదృతువు

మాసం: అశ్వియుజం పక్షం: శుక్ల పక్షo

తిథి: పంచమి ఉ 6:58

తదుపరి షష్ఠి

నక్షత్రం: జ్యేష్ఠ, రా.12:48

యోగం: సౌభాగ్యం తె. 4:30

కరణం: బాలువ ఉ 6:58 తదుపరి కౌలవ రా 7:12

వర్జం: ఉ 5:29 - 7:09

అమృతకాలం: ప 3:33 - 5:14

దుర్ముహుర్తం: ఉ 8:15 - 9:02

రా 10:34 - 11:23

శుభసమయాలు: మ 12:00 - 1:00

అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:37

బ్రహ్మముహూర్తం: ఉ 4:18 - 5:06

రాహుకాలం: మ 3:00 4:30

యమగండం: ఉ 9:00 -10:30

గుళికకాలం: మ 12:00 -1:30

సూర్యరాశి: కన్య

చంద్రరాశి: వృశ్చికం

సూర్యోదయం: 5:54

సూర్యాస్తమయం: 5:45

మేషం(Aries )

ఈ రాశివారు ప్రారంభించబోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. సమస్యల క్రమంగా తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

వృషభం(Taurus)

ఈ రాశివారికి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.

మిథునం(Gemini)

ఈ రాశివారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉన్నాయి. సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మంచిది.

కర్కాటకం(Cancer)

ఈ రాశివారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగి మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

సింహం(Leo)

ఈ రాశివారు దృఢమైన మనస్సుతో ముందుకు సాగండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి ఉంది. భోజన సౌఖ్యం కలదు. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

కన్య(Virgo)

ఈ రాశివారికి ఒక వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. ఇంటి వ్యవహారాలలో, విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయబేధాలు వస్తాయి. దుర్గాస్తోత్రం చదవాలి.

తుల(Libra)

ఈ రాశివారు అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసి అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచిపేరు దక్కుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.

వృశ్చికం(Scorpio )

ఈ రాశివారు మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒక సంఘటన మానసికశక్తిని పెంచుతుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది.

ధనుస్సు(sagittarius)

ఈ రాశివారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మకరం(capicorn)

ఈ రాశివారు వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగాలి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. నవగ్రహ శ్లోకాలు చదవడం మంచిది.

కుంభం(aquarius)

ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మరువద్దు. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.

మీనం(Pisces)

ఈ రాశివారికి శుభఫలితాలు ఉన్నాయి. స్పష్టమైన ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. తలపెట్టిన పనిలో విజయం వరిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శివారాధన శుభప్రదం.

Eha Tv

Eha Tv

Next Story