Today Rasi Phalalu : ఈ రాశివారికి అన్ని శుభ ఫలితాలే!
ఈ రాశివారు కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు.
07.10.2024,సోమవారం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - శరదృతువు
ఆశ్వయుజ మాసం -శుక్ల పక్షం
తిథి:చవితి ఉ6.01 వరకు
వారం: ఇందువాసరే
(సోమవారం)
నక్షత్రం:అనూరాధ రా11.36 వరకు
యోగం:ఆయుష్మాన్ తె5.12 వరకు
కరణం:భద్ర ఉ6.01 వరకు
తదుపరి బవ సా6.29 వరకు
వర్జ్యం:తె5.29 నుండి
దుర్ముహూర్తము:మ12.12 - 12.59
అమృతకాలం:మ12.29 - 2.12
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.54
సూర్యాస్తమయం:5.45
మేషం (Mesham)
ఈ రాశివారు బుద్ధిబలంతో కొన్ని వ్యవహారాలలో సమస్యలను అధిగమించగలుగుతారు. మనఃస్సౌఖ్యం ఉంది. మనోల్లాసం కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువులతో వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.
వృషభం (Vrushabam)
ఈ రాశివారికి ధర్మసిద్ధి కలదు. బుద్ధిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్ట దైవ సందర్శనం శుభప్రదం.
మిథునం (Mithunam)
ఈ రాశివారికి తమ తమ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు.ఇష్టదేవతారాధన శుభప్రదం.
కర్కాటకం (Karkatakam)
ఈ రాశివారికి పెద్దల ఆశీస్సులు రక్షిస్తాయి. బంధు,మిత్రుల సహకారం లభిస్తుంది. కాలాన్ని మంచి విషయాల కోసం వినియోగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీదుర్గాధ్యానం శ్రేయస్కరం.
సింహం (Simham)
ఈ రాశివారు కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శివనామస్మరణ శుభప్రదం.
కన్య (Kanya)
ఈ రాశివారు వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తపడాలి. ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం శుభప్రదం.
తుల (Thula)
ఈ రాశివారు అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థికసాయం అందుతుంది. బంధుప్రీతి ఉంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
వృశ్చికం (Vruchikam)
ఈ రాశివారికి వారి మనోధైర్యం వారిని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
ధనుస్సు (Dhanushu)
ఈ రాశివారు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసంగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.
మకరం (Makaram)
ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. ఇష్టదైవ ప్రార్థన శుభకరం.
కుంభం (Kumbam)
ఈ రాశివారికి ఇది శుభకాలం. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో విజయాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.
మీనం (Meenam)
ఈ రాశివారికి ఈ రోజు శుభఫలితాలు ఉన్నాయి. సంతోషంగా కాలం గడుపుతారు. ముఖ్య విషయంలో అనుకున్నది దక్కుతుంది. అర్థలాభం ఉంది. శ్రీలక్ష్మీధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.